S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డ్రిప్.. డ్రిప్...

అనంతపురం, జూలై 22 : ఎపిఎంఐపి ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న డ్రిప్ పరికరాల కోసం రైతులు ముమ్మరంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వర్షాభావం, అకాల వర్షాల కారణంగా ఏటా రబీ, ఖరీఫ్ సీజన్‌లలో వేరుశెనగతో పాటు ఇతర పంటలు నష్టపోతున్న జిల్లా రైతాంగం పండ్ల తోటలు, కూరగాయల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా నీటిని పొదుపుగా వాడుకుని పంటలను సంరక్షించుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్‌పై ఆధార పడాల్సి వస్తోంది. దీంతో చాలామంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాకు 35,000 హెక్టార్లలో డ్రిప్ సౌకర్యం కల్పించాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రిప్ కోసం శుక్రవారం నాటికి 45,990 హెక్టార్లలో 34,673 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లక్ష్యంతో ఇప్పటి వరకు 3వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలను ఎపిఎంఐపి అధికారులు వివిధ కంపెనీల ద్వారా సరఫరా చేశారు. కాగా అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న ందున లక్ష్యానికి మించి రైతులు డ్రిప్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ల క్ష్యాన్ని మించి దాదాపు 46 వేల హెక్టార్లలో డ్రిప్ సౌకర్య ం కల్పించాలని రైతులు తమ భూముల పేర్లను రిజిష్టర్ చేసుకున్నా రు. అయితే ఇందులో డబుల్ ఎంట్రీ లు ఉంటాయని, క్షేత్ర పరిశీలనలో గుర్తించి అర్హులకు డ్రిప్ అందేలా చర్యలు తీసుకుంటామని ఎపిఎంఐపి అధికారులు చెబుతున్నారు. కాగా గతంలో కొందరు అనర్హులకు డ్రిప్ పరికరాలు అందాయన్న ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఈసారి అర్హులకు అన్యాయం చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పదెకరాల వరకూ సబ్సిడీ పెంపు
పదెకరాల వరకూ డ్రిప్ వేసుకోవాలనుకున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీని పెంచింది. తొలుత రూ.లక్ష మేరకు ఇస్తున్న సబ్సిడీని రూ.2 లక్షలకు పెంచింది. పదెకరాల పొలంలో కుటుంబ సభ్యుల పేర డ్రిప్ తీసుకునే వీలు కల్పించింది. పదెకరాలకు పైగా పొలంలో డ్రిప్ వేసుకునే వారికి రూ.4 లక్షల మేర సబ్సిడీ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే సబ్సిడీతో డ్రిప్ తీసుకుని ఐదేళ్లు పూర్తయిన ఇతర రైతులు సైతం కొత్త ల్యాటరల్స్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాంటి వారికి 50 శాతం సబ్సిడీతో ల్యాటరల్స్‌ను సరఫరా చేస్తామని ఎపిఎంఐపి అధికారులు తెలిపారు.