S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 21:11

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై బంపర్‌హిట్ కొట్టిన ‘జనతా గ్యారేజ్’తో ఎన్టీఆర్ మళ్లీ తన కెరీర్‌లో పూర్తి ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక ఈ రేంజ్ హిట్ కొట్టాక ఆయన చెయ్యబోయే కొత్త సినిమా ఏమై వుంటుందని అభిమానులంతా ఎదురుచూస్తుండగా, రెండు మూడు నెలలుగా సరైన సమాధానం దొరకలేదు. ఇక ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్న ఎన్టీఆర్, చివరకు దర్శకుడి బాబీకి అవకాశమిచ్చారు.

12/09/2016 - 21:09

ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన రామ్‌గోపాల్‌వర్మ చిత్రం ‘వంగవీటి’ డిసెంబర్ 23న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో కార్యక్రమం రోజున విజయవాడలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు వంగవీటి రంగా వర్గీయులు, మరోవైపు రామ్‌గోపాల్‌వర్మ ఎవ్వరూ ఎక్కడా తగ్గలేదు. కొద్దిసేపట్లోనే ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చివరికి ఎలాగో వర్మ విజయవాడలో ఆడియో వేడుక పూర్తిచేశాక అంతా సద్దుమణిగింది.

12/09/2016 - 21:04

‘బెంగాల్ టైగర్’ తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు రవితేజ. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపి ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో సైలెంట్ అయ్యాడు. ఇప్పటికే ఏడాదికిపైగా గడుస్తున్నా రవితేజ నెక్స్ట్ సినిమా ఏంటి అనే సందేహం ఇంకా ఆయన ఫ్యాన్స్‌లో నెలకొంది. ఫైనల్‌గా రవితేజ నెక్స్ట్ సినిమా ఓకే చేసాడు.

12/09/2016 - 21:01

అవసరాల శ్రీనివాస్ కథానాయకుడుగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘బాబు.. బాగా బిజీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/09/2016 - 20:58

రామ్మోహన్.పి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పిట్టగోడ’. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్.పి నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.

12/09/2016 - 20:56

హీరో సూర్య తన కెరీర్‌ను స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ పెద్ద హీరోగా మారిన విషయం తెలిసిందే. కెరీర్ మొదటి రోజుల్లో సూర్య నటించిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా కాకా’. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఇక్కడ పెద్దగా ఆడలేదు.

12/09/2016 - 20:53

విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఆర్.పి.ఎ. క్రియేషన్స్, డి.వి. సినీ క్రియేషన్స్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం పిజ్జా-2. తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ - ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులను, అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలుపుతూ ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ధ్రిల్లర్ జోనర్‌లో సినిమా రూపొందించామని తెలిపారు.

12/09/2016 - 20:53

పల్లాడ సాయికృష్ణ కథానాయకుడిగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్, శ్రీలక్ష్మి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ఎందరో మహానుభావులు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. సంగీత దర్శకుడు రఘు కుంచె ఆడియో సీడీని విడుదల చేశారు.

12/09/2016 - 20:50

విజెవైఎస్ ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళంలో ఘన విజయం సాధించిన ‘తర్కప్పు’ చిత్రాన్ని ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’గా వై.శేషిరెడ్డి తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’ చిత్ర విశేషాలను చిత్ర సమర్పకుడు వై.శేషిరెడ్డి తెలియజేస్తూ..

12/09/2016 - 20:50

ఈమధ్య సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్‌గా మారాయి. ఇప్పటికే పలువురు భామలు ఈ విషయంలో ఒకడుగు ముందుకేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ఈ లిప్ లాక్ సీన్స్‌కి కొదువే లేదు. ఈమధ్యే తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువయ్యాయి. ఇక తెలుగు భామ తేజస్విని కూడా ఈ విషయంలో మంచి జోరుమీదుంది. ఐస్‌క్రీమ్ తరువాత హాట్ డోస్ పెంచిన ఈ భామ, తనలోని గ్లామర్ యాంగిల్‌ని బాగానే బయటపెట్టింది.

Pages