S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 05:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పార్లమెంటు ప్రతిష్టంభనపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటును పనిచేయనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టసభలు ఉన్నది ధర్నాలు చేయడానికి కాదని ధ్వజమెత్తారు. సభ పనిచేయకుండా అడ్డుకోవడం అంటే మైనారిటీ సభ్యులు మెజారిటీ సభ్యుల నోరు నొక్కడమే అవుతుందని ఆయన అన్నారు.

12/09/2016 - 05:05

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 8: ఖండాంతర ఖ్యాతి చెందిన పోచంపల్లి చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఐటి శాఖామంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. గురువారం భూదాన్ పొచంపల్లి మండలం కనుముకుల గ్రామం చేనేత పార్కును ఆయన సందర్శించారు. చేనేత పార్కులోని మగ్గాలను, వస్త్రాలను ఆయన పరిశీలించారు. వస్త్రాల తయారీ విధానం, రంగుల అద్దకాల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

12/09/2016 - 05:03

న్యూఢిల్లీ/ విశాఖపట్నం (గాజువాక): డిసెంబర్ 8: విశాఖపట్నం నుండి ఢిల్లీ (హజారత్ నిజాముద్దీన్) వెళ్లే సమతా సూపర్ ఫాస్ట్ రైలు పేరును వైజాగ్ స్టీల్ సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా గురువారం మార్పు చేశారు. ఈ మేరకు గురువారం నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో బయలుదేరిన వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్, రైల్వేశాఖ మంత్రి సురేష్ పి ప్రభు జెండా ఊపి ప్రారంభించారు.

12/09/2016 - 05:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: తెలుగు రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపవద్దంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారంటూ ‘రేలా’ స్వచ్చంద సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది.

12/09/2016 - 05:00

హైదరాబాద్, డిసెంబర్ 8: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో క్యాత్య పసిఫిక్ విమానం నిలిచిపోయింది. సిఎక్స్ 646 పసిఫిక్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హాంగ్‌కాంగ్ వెళ్లాల్సి ఉంది. కాగా విమానంలో సాంకేతిక లోపంత తలెత్తడంతో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే విమానాన్ని ల్యాండ్ చేశారు.

12/09/2016 - 05:00

హైదరాబాద్, డిసెంబర్ 8: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్లు ఉన్నట్టు ప్రకటించిన బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు రైస్‌పుల్లింగ్ కాయిన్‌ను కనుగొన్నారు. లక్ష్మణ్‌రావు వద్ద కేవలం రూ. 1.42 లక్షలు మాత్రమే ఉందని తేలడంతో అతని ఇంటితోపాటు ఇద్దరు కొడుకులు, కోడళ్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

12/09/2016 - 04:58

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో రబీ సాగు జోరందుకుంది. 2016 నవంబర్‌లో యాసంగి (రబీ) పంటలకు విత్తనాలు వేయడం ప్రారంభమైంది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరటంతో పాటు, బావులు, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. అలాగే వాతావరణం పంటలకు అనుగుణంగా ఉంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పంటలకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది.

12/09/2016 - 04:58

హైదరాబాద్, డిసెంబర్ 8:ఈనెల 16నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రుల వ్యూహ కమిటీ గురువారం సమావేశం అయింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు సమావేశం అయ్యారు.

12/09/2016 - 04:57

విశాఖపట్నం, డిసెంబర్ 8: విశాఖ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీల్లో భాగంగా ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.56.88 లక్షల విలువైన 1.966 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు హైదరాబాద్, మరో వ్యక్తి దుబాయి నుంచి వస్తున్నారు.

12/09/2016 - 04:52

సంగారెడ్డి, డిసెంబర్ 8: రైతుల ఆత్మహత్యలు, వలసలు నివారించడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టాలని యోచిస్తే కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి తప్పులన్నింటిని ఎత్తి చూపించి అసెంబ్లీలో సబ్బుతో కడిగినట్లు కడిగేస్తానని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు.

Pages