S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 04:50

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 8: విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ పంచాయతీ శివారులోని శ్రీనాథ్ రూట్ ప్యాక్ లిమిటెడ్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు, కార్మికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

12/09/2016 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 8: నోట్ల సమస్యపై ప్రజల్లో అంతర్యుద్ధం (సివిల్ వార్) వచ్చే ప్రమాదం ఉందని పిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నోట్లను రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా, ప్రజలకు ఉపశమనం కలిగించ లేకపోయారని విమర్శించారు. ‘సామాన్యులు పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు.

12/09/2016 - 04:48

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో డిసెంబర్ 15 నుండి 26 వరకు హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తెలిపారు. సచివాలయంలో గురువారం నేషనల్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను రమణాచారి ఆవిష్కరించారు. నోట్ల రద్దు ప్రభావం లేకుండా నగదు రహితంగా పుస్తకాలు కొనుగోలు చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయాలని కోరారు.

12/09/2016 - 04:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో వీలున్నంత త్వరగా ప్రతిపాదిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య గురువారం తెలిపారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయలతో కలిసి నంది ఎల్లయ్య పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీని కలిశారు. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను వారు వివరించగా ప్రధాని సావధానంగా విన్నారు.

12/09/2016 - 04:47

హైదరాబాద్, డిసెంబర్ 8: ‘రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా బాధపడకూడదన్నది నా అభిమతం. అందుకే నిబంధనల ప్రకారం సాధ్యం కాదంటున్నా మానవతా దృక్పథంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించాం’ వారం రోజుల కిందట విద్యుత్‌శాఖ ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పంది స్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది. ‘ఒకే పని చేసే ఉద్యోగులకు ఒకేరకంగా వేతనం ఉండాలి.

12/09/2016 - 04:46

హైదరాబాద్, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వ పథకం కింద నడుస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి కోరామని పేర్కొన్నారు.

12/09/2016 - 03:41

మచిలీపట్నం, డిసెంబర్ 8: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిన అధికారులు గురువారం బందరు పోర్టులో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరించారు.

12/09/2016 - 03:39

విశాఖపట్నం, డిసెంబర్ 8: విశాఖకు 1,028 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉన్న వార్ధా తుపాను ఈ నెల 12న సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో 11 నుంచి కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే పదో తేదీ నుంచి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఈ కేంద్రం పేర్కొంది.

12/09/2016 - 03:38

విఆర్‌పురం/కూనవరం/చింతూరు, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టర్లు, సబ్-కాంట్రాక్టర్ల కోసమే నిర్మాణ వ్యయం అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. రూ.16వేల కోట్ల అంచనా వ్యయంగా నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయాన్ని తాజాగా రూ.36వేల కోట్లకు పెంచేశారన్నారు.

12/09/2016 - 03:36

గుంటూరు, డిసెంబర్ 8..ఒకానొకప్పుడు బౌద్ధం పరిఢవిల్లిన నేలగా ప్రసిద్ధిగాంచి నాటి చారిత్రక కట్టడాలు పునరుజ్జీవం పోసుకుంటున్న నాగార్జునసాగర్‌కు దక్షిణ వైపున ఉన్న గుంటూరు జిల్లా అనుపు గ్రామంలో 16 వందల సంవత్సరాల తరువాత మూడురోజుల పాటు ఉత్సవాల నిర్వహిస్తున్నారు.

Pages