S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 04:52

వికారాబాద్, డిసెంబర్ 5: నవమాసాలు మోసి కని పెంచిన కొడుకే కన్నతల్లిని దారుణంగా చంపిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ జి.రవి తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారంలోని సాయిబాబా కాలనీలో నివాసముండే వడ్డే అంజమ్మ (40) పలు ఇళ్ళలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కొడుకు వెంకటయ్య కల్లు దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తాడు.

12/06/2016 - 04:52

హైదరాబాద్, డిసెంబర్ 5: అంతర్జాతీయంగా విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరిందని, విత్తనోత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘విత్తన నమూనా, స్వచ్ఛత, అంకురోత్పత్తి’ అంశంపై హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ఐదురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.

12/06/2016 - 04:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు ఇక్కట్లపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించిన తెరాస పక్షం నాయకుడు జితేందర్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీల సభ్యులు కొట్టినంత పని చేశారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు 193 నియమం కింద జితేందర్ రెడ్డి నోటీసు ఇచ్చారు.

12/06/2016 - 04:43

హైదరాబాద్/సిద్ధిపేట, డిసెంబర్ 5: తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ దేశంలోనే రెండవ నగదురహిత గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా నిలిచింది. వంద శాతం నగదురహిత కార్యకలాపాల ద్వారా దేశంలో రెండవ గ్రామంగా రికార్డు సృష్టించింది. సిద్దిపేట నియోజక వర్గం పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని మంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు.

12/06/2016 - 04:40

కరీంనగర్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో కీలకపాత్ర పోషిస్తూ తెలంగాణ జాతిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన సమయంలో వారు ఉద్యమకారులు..నేడేమో వారు ద్రోహులా అంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభ పక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ అవలంభిస్తున్న వైఖరి, వైఫల్యాలపై మాట్లాడితే చాలు వారిని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

12/06/2016 - 04:37

చిత్రం..హైదరాబాద్‌లో సోమవారం నగదు కోసం ట్యాంక్ బండ్ ఎస్‌బిహెచ్ వద్ద పెద్ద సంఖ్యలో
బారులు తీరిన ప్రజలు

12/06/2016 - 04:34

హైదరాబాద్, డిసెంబర్ 5: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంటసేపు సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నెల మూడవ వారంలో వారం రోజుల పాటు శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాల నిర్వహణపై గవర్నర్‌కు వెల్లడించినట్టు తెలిసింది.

12/06/2016 - 04:29

హైదరాబాద్, డిసెంబర్ 5: జాతీయ పుస్తక మహోత్సవాన్ని ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకూ హైదరాబాద్ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి కె చంద్రమోహన్‌లు తెలిపారు. ప్రతి రోజు మధ్యా హ్నం 2 గంటల నుండి సాయంత్రం 8.30 వరకూ జరుగుతుందని అన్నారు.

12/06/2016 - 04:28

దేవరకొండ, డిసెంబర్ 5: గడ్డం పెంచుకున్నంత మాత్రాన సి ఎం అవుతాననుకోవడం తప్పని, అలా అనుకోవడం దద్దమ్మలకే చెల్లుతుందని తలక్రిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం కల్లేనని రాష్ట్ర అటవీ, బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం పట్టణంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/06/2016 - 04:19

తిరుపతి, డిసెంబర్ 5: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గత పది రోజులుగా నిర్వహించిన కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిశాయి. ఈక్రమంలో సోమవారం అమ్మవారికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. ఈసందర్భంగా టిటిడి అధికారులు 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలను గంపల్లో ఉంచుకుని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించారు.

Pages