S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 22:14

పురుషాధిక్యమేలే మన దేశ సినీ, రాజకీయ రంగాల్లోకి ఓ యువతి కెరటం వలే దూసుకువచ్చింది. ఆటుపోట్లనెన్నింటినో ఎదుర్కొని పడిన ప్రతిసారి సునామీలా ఎగిసిపడింది. మూడు పదులు దాటిన వయసు నుంచే ఏటికి ఎదురీది అశేష ప్రజానీకం నోరారా ‘అమ్మ’అని పిలుచుకునే స్థాయికి ఎదిగింది. ఎంజీఆర్ అనే రాజకీయ పాఠశాలలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నది.

12/06/2016 - 22:06

శరీరం, మనసు ఆహ్లాదంగా ఉండాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరం. అది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి వుంటుంది. ఇదే విషయాన్ని వైద్యులు సైతం చెప్పక తప్పదు. ఫలాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యఫలం సిద్ధిస్తుందని, ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ తీసుకుంటే వ్యాధులు చాలా తక్కువగా వచ్చే అవకాశం వుంటుంది. వీటిల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. డ్రైఫ్రూట్స్ తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి చాలావరకూ మేలు చేకూరుతుంది.

12/06/2016 - 22:02

అన్ని కాలాల్లోను లభిస్తుంది నిమ్మికాయ. ఇది సిట్రస్ జాతికి చెందినది. రుచికి పులుపుగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మపండులో నీరు, సి విటమిన్ అత్యధికంగా లభిస్తాయి. నిమ్మరసం ఏ విధంగా శరీరానికి తోడ్పడుతుందో తెలుసుకుంటే ప్రతివారూ నిమ్మరసాన్ని తప్పక వాడతారు.
ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, తేనెను కలిపి త్రాగితే అధిక బరువును తగ్గించవచ్చును.

12/06/2016 - 21:54

సిఓపిడి (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) ఇప్పుడు పొగతాగనివారికి కూడా సోకుతుంది. ఈ వ్యాధి 300 లక్షల జీవితాలను ప్రభావితం చేస్తుంది, ఇంకా ఎన్నో సిఓపిడి కేసులను నిర్థారించడం జరగలేదు. తీవ్ర అవరోధాన్ని కలిగించే శ్వాసకోశనాళం వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 5వ ప్రాణాపాయకర వ్యాధిగా విజృంభించింది.

12/06/2016 - 21:51

చక్కెర వ్యాధి అత్యంత క్లిష్టమైన, తీవ్రమైన జీవక్రియా సంబంధిత వ్యాధి. రక్తంలో అధికంగా గ్లూకోజ్ స్థాయిని ఇది కలిగి వుంటుంది. తొలినాళ్లలో కొద్ది పరిమాణంలో మార్పులు కలిగి ఉండే చక్కెర నిలువలు ఎలాంటి లక్షణాలనూ చూపవు. ఈ ఫలితంగానే, చాలామంది రోగులు తమకు చక్కెర వ్యాధి ఉందనే సంగతి కూడా గ్రహించలేకపోతుంటారు.

12/06/2016 - 21:48

ప్రశ్న: నా వయసు 39 సంవత్సరాలు. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు కొంతకాలంగా తల పొడి పొడిగా వుండి పొట్టు రాలుతూ వుంది. ‘మధ్యరాత్రి’ దురద, తీవ్రమైన మంట వుంటుంది. దయచేసి సరైన మందును సూచించి పరిష్కారం చూపగలరు.
-కరుణాకర్, గుడివాడ

12/06/2016 - 21:46

నవీన యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది కాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ అంతా ఇంతా కాదు.

12/06/2016 - 21:44

ప్ర: గుండె జబ్బు వచ్చినపుడు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా?
-కాత్యాయనీ రామం, కొత్తగూడెం
జ: గుండె జబ్బులు వచ్చాక ఆహార జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టటం అనేది చేతులు కాలాక ఆకులు పట్టడం లాంటిది. గుండె జబ్బులు మధ్యతరగతిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి జీవన విధానం, ఆలోచనా విధానాలే గుండె జబ్బులకు కొంత కారణం అవుతున్నాయి.

12/06/2016 - 21:21

ఈ సృష్టి చాలా విచిత్రమైనది. భగవంతునిచే సృష్టించబడిన మనిషికి భగవంతుడు ‘ఒంటరితనం’ అనే రక్కసి కోరల్లో నుండి తప్పించుకొనుటకు ‘సమాజం’ అనే మిత్రుడ్ని ప్రసాదించుట భగవంతుని సృష్టి వైచిత్రానికి ప్రధాన తార్కాణం. ఈ సమాజంతోపాటు మానవుడికి దైవం/మతం అనేవి ప్రసాదించి అతడి దృష్టిని అంతర్ముఖం గావించి మానవుడ్ని ఇలపై (్భగవంతుని) తన ప్రతిరూపంగా మలచుటయే ఆ ఆద్యంతరహితుని అపర సృష్టి ప్రత్యేకత.

12/06/2016 - 21:20

వేన వేల యోజనాల వైశాల్యంతో అలరారే లక్ష కోటి శలాకలతో (ఊచలతో) అలంకరించబడిన, నక్షత్రాల వంటి పెద్ద ముత్యాలతో పొదుగబడిన శే్వతచ్ఛత్రాన్ని వెనకయ్య వెన్నుడికి పట్టాడు.
పట్ట్భాషేక సమయంలో పలు రీతులుగా విష్ణుమూర్తిని పార్వతీదేవి అలంకరించింది. సరస్వతీదేవి మణులు కూర్చిన అద్దాన్ని చూపింది. శచీదేవి మణిమయ దీప సమూహంతో నివ్వాళి పట్టింది.

Pages