S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 04:02

చెన్నై, డిసెంబర్ 5: మొదట మామూలు జ్వరం, అతిసారంతో అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ లాంటి అనేక సమస్యలతో దాదాపు మూడు నెలలుగా ఆస్పత్రిలోనే ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు నెలలు కూడా జయలలిత లేకుండానే రాష్ట్రంలో పరిపాలన సాగిందనేది వాస్తవం.

12/06/2016 - 04:01

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేయాలనుకున్న కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.

12/06/2016 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 5: పంటల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళ్లాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్ (ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, నాంపల్లి)లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, విత్తనోత్పత్తిలో తెలంగా ణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.

12/06/2016 - 03:59

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సంఘటనల క్రమం ఇది.
2016 సెప్టెంబర్ 22: జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిక

12/06/2016 - 03:44

చిత్రాలు..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమవుతున్న అభిమానులు, ఎఐఎడిఎంకె కార్యకర్తలు

12/06/2016 - 03:39

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినందున రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు తలెత్తవచ్చంటూ వస్తున్న వార్తలను అర్థం లేనివిగా ఎండిఎంకె నాయకుడు వైగో ఖండించారు. అలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్న వారు పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. ‘అస్థిరత లేనే లేదు. అలాంటి పరిస్థితి తలెత్తనే తలెత్తదు. కొంతమంది గాలిలో మేడలు కడుతూ ఉండవచ్చు.

12/06/2016 - 03:38

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆమెను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు.

12/06/2016 - 03:35

సూళ్లూరుపేట, డిసెంబర్ 5: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి బుధవారం ఉదయం 10.25గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-36 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 36గంటల ముందు నుంచి అంటే సోమవారం రాత్రి 10.25గంటలకు ప్రారంభమైంది.

12/06/2016 - 03:33

గుంటూరు, డిసెంబర్ 5: మార్గశిర పౌర్ణమి గురుదత్త జయంతి సందర్భంగా విశ్వగురు పీఠంలో ఈ నెల 13న దత్తజయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు.

12/06/2016 - 03:30

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డిఎంకె అధినేత్రి జయలలిత జీవించి ఉన్నారా? లేదా? అనే విషయం ప్రజలకు తెలియాల్సి ఉందని ఆ పార్టీ నుంచి బహిష్కృతురాలయిన ఎంపి శశికళ పుష్ప అన్నారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన జయలలిత తర్వాత కోలుకున్నారు.

Pages