S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 04:17

కర్నూలు, డిసెంబర్ 5: తమ వద్ద ఉన్న రద్దయిన పెద్దనోట్లను వదిలించుకునేందుకు ప్రైవేటు సంస్థలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. జీతాల రూపంలో వాటిని ఉద్యోగులు, కార్మికులకు అంటగడుతున్నాయి. గత నెలలో పెద్దనోట్లు రద్దుచేస్తున్నట్లు ప్రధాని ప్రకటించగానే ఉద్యోగులు, కార్మికులకు జీతాల రూపంలో రద్దయిన పెద్దనోట్లను ప్రైవేటు సంస్థలు అందించాయి. వరుసగా రెండో నెల సైతం రద్దయిన పెద్ద నోట్లను జీతాల రూపంలో అందించాయి.

12/06/2016 - 04:16

పోలవరం పునరావాసం
ఎలా చేపడుతున్నారు?
రాజ్యసభలో విజయసాయి ప్రశ్న

12/06/2016 - 04:15

విజయవాడ, డిసెంబర్ 5: రైతులు, చేతివృత్తులవారు, పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేతివృత్తులవారి ఉపాధి దెబ్బతినకుండా అధికార యంత్రాంగం శ్రద్ధ వహించాలన్నారు.

12/06/2016 - 04:13

విజయవాడ, డిసెంబర్ 5: తమిళనాడులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం నుంచి చెన్నై వెళ్లే ఎపిఎస్ ఆర్టీసీ బస్సులు సాయంత్రం నుంచి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ ఎం.మాలకొండయ్య ఉన్నతాధికారులతో సమావేశమై ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితులకు అనుగుణంగా తక్షణం నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయా జిల్లాల రీజనల్ మేనేజర్లను ఆదేశించారు.

12/06/2016 - 04:12

విజయవాడ, డిసెంబర్ 5: ఏ ఊళ్లో పడిన వర్షం ఆ ఊళ్లోనే ఇంకేలా చూడాలని, నీరు-ప్రగతి పనులు ముమ్మరంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీరు-ప్రగతిని నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి’ పనుల పురోగతిపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/06/2016 - 04:11

విజయవాడ, డిసెంబర్ 5: ప్రపంచ బ్యాంక్ రుణం రూ.2245 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు సెక్టార్ ప్రాజెక్టు పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ (ఎపిఆర్‌డిసి) గవర్నింగ్ బాడీ సమావేశం వెలగపూడి సచివాలయంలో సోమవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు.

12/06/2016 - 04:10

విజయవాడ, డిసెంబర్ 5: రాష్ట్రంలో విద్యా రంగంలో ఎంతో కీలకమైన వైద్యవిద్యా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ‘ఎంసిఐ’ కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే వైద్య రంగంలో 10 మంది నిష్ణాతులతో ఏర్పాటైన ఎపి మెడికల్ కౌన్సిల్ ప్రేక్షకపాత్ర వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

12/06/2016 - 04:10

విజయవాడ, డిసెంబర్ 5 రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 10 నుంచి నాలుగురోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. యుఎఇ, అబుదాబి, కువైట్‌లో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుల్లో పాల్గొనాల్సిందిగా అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.

12/06/2016 - 04:09

ఎచ్చెర్ల, డిసెంబర్ 5: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతంలో సోమవారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. సోమవారం అందరూ ఇళ్లకు చేరిన సమయానికి భారీ శబ్దాలు వచ్చి భూమి కంపించడంతో జనం ఆందోళనతో పరుగులు తీశారు. సరిగ్గా సాయంత్రం 5.58గంటలకు భూమి కంపించడంతో ఇళ్లల్లో ఉన్న వారంతా ఉల్లిక్కిపడ్డారు. సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు పలు గ్రామాల్లో స్థానికులు తెలియజేశారు.

12/06/2016 - 05:15

విశాఖపట్నం, డిసెంబర్ 5: దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపాన అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం సోమవారం రాత్రి తెలిపింది. ఇది ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారి కొనసాగుతోందని పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం చాలా దూరాన ఉందని, రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ కేంద్రం తెలియజేసింది.

Pages