S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/26/2018 - 01:55

ఒంటిమిట్ట, మార్చి 25: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్లే బీజేపీకి ఆ మాత్రం గుర్తింపు లభించిందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపిలో టీడీపీ వల్ల గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ, రాష్ట్రానికి న్యాయం చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు.

03/26/2018 - 01:55

రాజమహేంద్రవరం, మార్చి 25: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోదావరి డెల్టాల్లో రబీ సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గోదావరి జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాలు బీడు వారిందని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

03/26/2018 - 01:54

కాకినాడ, మార్చి 25: ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద సాంకేతిక విశ్వ విద్యాలయంగా పేరొందిన కాకినాడ జేఎన్‌టియూ వైస్-్ఛన్సలర్ పదవి కోసం రాష్టవ్య్రాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవిని అలంకరించడానికి పలువురు ఆశావహులు రాజధాని స్థాయిలో పైరవీలు ముమ్మరం చేసినట్టుతెలిసింది.

03/26/2018 - 01:53

విజయవాడ, మార్చి 25: ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తికి దేవదాయ, ధర్మదాయ శాఖ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అప్పగించింది. బీజేపీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ శాఖ మంత్రి పదవికి పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో ఆ శాఖను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ, శాసన మండలిలో ఆయన తరపున మంత్రి అచ్చెన్నాయుడు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.

03/26/2018 - 03:35

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర రెండోరోజు ఆదివారం కూడా అదే హోరు, జోరుగా సాగింది. ఆయన బస చేసిన శిబిరం నుండి ఉదయం 8 గంటలకు ప్రజాసంకల్ప యాత్రకు బయలుదేరారు. అడుగడుగునా యువకులు, యువతులు, మహిళలు, చిన్నాపెద్దా జగన్‌ను నిలిపివేసి సెల్ఫీ దిగాలని ఆరాటపడ్డారు. ఆయన ఎవరినీ కాదనలేకపోయారు.

03/26/2018 - 01:44

హిందూపురం, మార్చి 25: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం సుమారు 15 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి పార్టీ కార్యకర్తలు, నాయకులను హుషారెత్తించారు. లేపాక్షి నంది ఉత్సవాల ప్రచారంలో భాగంగా ఆదివారం కొడికొండ నుంచి లేపాక్షి నంది విగ్రహం వరకూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప, కలెక్టర్ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.

03/26/2018 - 01:41

విశాఖపట్నం, మార్చి 25: ఇండియా-మయన్మార్ నౌకాదళాల సంయుక్త విన్యాసాలు విశాఖలో ఆదివారం ప్రారంభమయ్యాయి. చాలా కాలం తరువాత తూర్పు తీరంలో మయన్మార్, భారత నౌకాదళా సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. ఇవి రెండు భాగాలుగా జరగనున్నాయి. మొదటి భాగం ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకూ, రెండో భాగం ఈ నెల 31 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకూ జరగనున్నాయి.

03/26/2018 - 03:34

విజయవాడ: పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించే విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందున్న ఆంధ్రప్రదేశ్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థిరమైన విద్యుత్ చార్జీలను కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిశ్రమలను ప్రోత్సహించాలంటే కనీసం 5 నుంచి పదేళ్ల పాటు విద్యుత్ టారిఫ్‌ను స్థిరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

03/26/2018 - 00:01

కర్నూలు, మార్చి 25: దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీకి ఆహ్వానం పంపితే అందులో చేరే అంశంపై ఆలోచిస్తామని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు.

03/26/2018 - 00:01

విజయవాడ, మార్చి 25: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ 5కోట్ల మంది ఆంధ్రులను నమ్మించి మోసం చేశాయని, ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్‌కు మంచిపేరు వస్తుందని కుట్ర చేశాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కలిసి ఉండి, ఇప్పుడు ఒకరికొకరు అధికార, ప్రతిపక్షాలుగా మారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

Pages