S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/21/2018 - 03:48

విజయవాడ, మార్చి 20: రెండు నదుల సంగమానికి వేదికగా మారిన కొండపల్లి ఖిల్లా తెలుగుజాతి ప్రగతితో ముడిపడి సాగుతున్న నేపథ్యంలో కొండపల్లి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం నాడిక్కడ తెలిపారు. కృష్ణదేవరాయలు కొండపల్లి కోటను జయించి, 500 ఏళ్లు అయిన సందర్భంగా ఏప్రిల్ 5,6,7 తేదీల్లో కొండపల్లి మహోత్సవాలు జరగనున్నాయని అన్నారు.

03/21/2018 - 03:47

విజయవాడ, మార్చి 20: రాజధాని అమరావతిని దేశంలోని ఇతర రాష్ట్రాలకు కలుపుతూ కొత్త రైల్లే లైన్ల విషయమై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎండగట్టారు. కొత్త లైన్ల మంజూరులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

03/21/2018 - 03:46

విజయవాడ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ రథాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈనెల 22న అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య రథాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు.

03/21/2018 - 03:46

విజయవాడ, మార్చి 20: రాష్ట్రంలో జీవన్‌దాన్ కింద అవయవాల మార్పిడి కోసం 39 ఆసుపత్రులకు అనుమతి ఇచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ తరపున రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీజేపీ సభ్యులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి యనమల పై విధంగా సమాధానమిచ్చారు.

03/21/2018 - 03:45

విజయవాడ, మార్చి 20: విఐటి ఏపీ అమరావతి ప్రాంగణంలో 2018-19 విద్యా సంవత్సరంలో మూడేళ్ల బిబిఏ డిగ్రీ కోర్సును, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏడాది డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు విఐటి యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ డియర్‌బార్న్‌తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా ఒక అవగాహనకు వచ్చింది. వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి కార్యాలయంలో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు.

03/21/2018 - 03:44

విజయవాడ, మార్చి 20: రాష్ట్ర వ్యాప్తంగా బిల్లుల చెల్లింపులో అన్ని ట్రెజరీల్లోను ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న పాత విధానమే ఇక ప్రస్తుతం కూడా కొనసాగనున్నది. ట్రెజరీ కార్యాలయాల్లో తీసుకువస్తున్న సంస్కరణల్లో భాగంగా ఏ శాఖాధిపతి కూడా బిల్లులను స్వయంగా కార్యాలయాలకు వెళ్లకుండా తమ తమ కార్యాలయాల నుంచే ఆన్‌లైన్‌లో పంపించడం..

03/21/2018 - 03:40

విజయవాడ, మార్చి 20: కేంద్ర పన్నుల వాటా అంతా మాయ అని, కేటాయింపుల విధానంలో లోపం ఉందంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఆరోపించారు. దక్షిణాది నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంటే, ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. సెంట్రల్సీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్‌ఎస్)లను రద్దు చేయాలని, ఆ నిధులను రాష్ట్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

03/21/2018 - 03:36

విజయవాడ, మార్చి 20: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలవాణి కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు.

03/21/2018 - 03:34

అనకాపల్లి, మార్చి 20: కెమికల్ ఫ్యాక్టరీలో విషవాయువుల ప్రభావంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 20 మంది ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డారు. విశాఖ కెజిహెచ్‌లో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. ఈనెల 17న విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సంపతిపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌బి కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ బస్తాలను కార్మికులు తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు.

03/21/2018 - 04:27

అమరావతి, మార్చి 20: ఏపీకి అన్యాయం చేయడానికి బీజేపీ సిద్ధపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్యాయం చేయడమే కాదు, తనపై ఎదురుదాడికి కూడా సిద్ధపడిందని ఆరోపించారు. తనపై దాడి చేయడం అంటే రాష్ట్రాన్ని బలహీనపరచడమేనని ఆయన అన్నారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నాలుగేళ్లు ఓపికగా ఎదురు చూశామని రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు.

Pages