S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/22/2018 - 00:45

చిలకలూరిపేట, మార్చి 21: చంద్రబాబు దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపితే ఏపీకి హోదా సాధించుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రజలను సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/22/2018 - 00:44

నంద్యాల, మార్చి 21: కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో బీటీ-3 విత్తన పత్తి వ్యాపారంలో బడాబాబుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ అండదండలతో బీటీ-3 విత్తన మాఫియాను నేతలు శాసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల వైపు కనె్నత్తి చూసేందుకు కూడా వ్యవసాయాధికారులు సాహసించక పోవడానికి కారణం ఇదేనని అంటున్నారు.

03/21/2018 - 23:47

రైతులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు
పంటల బీమా సక్రమంగా అమలు కావట్లేదు
శాసన సభలో ముఖ్యమంత్రి చంద్ర బాబు

03/21/2018 - 23:47

తిరుపతి, మార్చి 21: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజానీకానికి ఇప్పటి వరకు అనేక కష్టాలు వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి చేసిన తరువాత కట్టుబట్టలతో హైదరాబాద్ విడిచి అమరావతికి రావాల్సి వచ్చిందన్నారు. తన మనవడు దేవాన్ష్ 4వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలసి కలిసి బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు.

03/21/2018 - 23:46

గుంటూరు, మార్చి 21: ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. శాసనసభలో బుధవారం వ్యవసాయంపై లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత గతంలో కంటే గణనీయంగా పెరిగిందన్నారు. 2017-18లో వ్యవసాయంలో 17.66 శాతం, ఉద్యానవన పంటలలో 18.62 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు.

03/21/2018 - 23:45

విజయవాడ, మార్చి 21: ప్రత్యేక హోదా, విభజనాంశాల అమలు కోసం గురువారం రాష్టవ్య్రాప్తంగా జరిగే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలంతా ఉప్పెనలా తరలి వచ్చి కేంద్రం కూసాలు కదిలించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావులు పిలుపునిచ్చారు.

03/21/2018 - 23:45

విశాఖపట్నం, మార్చి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోగా, విభజన హామీలు అమలు కాలేదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ మధు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం సీపీఎం ఆధ్వర్యాన విశాఖలో తలపెట్టిన మహాపాదయాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు.

03/21/2018 - 23:44

రాజమహేంద్రవరం, మార్చి 21: పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సిన పోలవరం ప్రాజెక్టు వ్యయంలో నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్న అంశానే్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎత్తిచూపారని, ఈ విషయాన్ని పవన్‌కళ్యాణ్ కలగన్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్

03/21/2018 - 23:43

విజయవాడ, మార్చి 21: పొత్తు కకావికలమైనందున టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమ నలుగురు సభ్యులు కూడా తక్షణం రాజీనామా చేస్తామని శాసనసభలో బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయమై బుధవారం శాసనసభలో వాడి వేడిగా చర్చ జరిగింది. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు నిధులు వృథా అయ్యాయని ఆరోపించారు.

03/21/2018 - 23:43

అనకాపల్లి, మార్చి 21: రాష్టమ్రంతా ఒకేమాట మీద ఉండి నేతలంతా కలసికట్టుగా నిలబడి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీవ్రతంర చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీకీ ప్రత్యేక హోదా రాకపోవడానికి అటు మోదీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు.

Pages