S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/22/2018 - 02:26

అమరావతి, మార్చి 21: వైసీపీది లాలూచీ రాజకీయమైతే తెలుగుదేశం పార్టీది 5 కోట్ల ప్రజల అవిశ్వాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెట్టిన వైసీపీ ఎంపీలకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రోజూ ఏం పని అని ప్రశ్నించారు. దీనిద్వారా వైసీపీ లాలూచీ రాజకీయం ఏమిటో ప్రజలు గమనించాలన్నారు.

03/22/2018 - 02:25

విజయవాడ (క్రైం), మార్చి 21: ఎయిర్ కార్గో సర్వీసులకు ఇక నుంచి విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) వేదిక కానుంది. ఇక్కడి నుంచి ఎగుమతి, దిగుమతులకు అనుమతి ఇస్తూ ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌తో ఎగుమతి, దిగుమతి కేంద్రంగా గన్నవరం విమానాశ్రయానికి ఎయిర్‌కార్గో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు రానుంది.

03/22/2018 - 02:24

విజయవాడ, మార్చి 21: ప్రతి ఇంటికి తాగునీరు, మురుగు నీటి నిర్వహణ ప్రభుత్వ ప్రాధాన్యత అని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. అసెంబ్లీలో బుధవారం 344వ నియమం కింద పట్టణ ప్రాంతాల్లో వౌళిక సదుపాయాలు, అభివృద్ధి అంశంపై చర్చ జరిగింది.

03/22/2018 - 02:24

విజయవాడ, మార్చి 21: తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు సౌకర్యం లేని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు బుధవారం అసెంబ్లీలో తెలిపారు. ఇందుకోసం 90 శాతం ఉపాధి హామీ నిధులు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వినియోగిస్తున్నామన్నారు.

03/22/2018 - 02:23

విజయవాడ, మార్చి 21: అక్రమ మైనింగ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి ఆరోపించారు. రాష్ట్ర శాసన మండలిలో బుధవారం ఈ మేరకు ప్రశ్న అడిగారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అక్రమార్జనకు అలవాటుపడ్డారని ఆరోపించారు. కొండాయపాలెం చెరువును డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారని, చీమకుర్తిలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు.

03/22/2018 - 02:22

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 21: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఐదుగురు సభ్యులతో గతంలో కమిటీని నియమించామన్నారు.

03/22/2018 - 02:22

విజయవాడ, మార్చి 21: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని రవాణాశాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు బుధవారం శాసనసభలో స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో నష్టాలలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అంటూ వచ్చిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ లేదండీ.. అసలు ఆ ప్రతిపాదనే లేకపోతే ఇక ప్రణాళికలు ఎలా రూపొందిస్తాం...

03/22/2018 - 02:21

విజయవాడ, మార్చి 21: ప్రత్యేకహోదా కోసం గురువారం నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో వైకాపాతో కలిసి పాల్గొనవద్దని టీడీపీ శ్రేణులకు రాష్ట్ర మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు సూచించారు. పార్టీ నేతలతో కళా బుధవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపాతో కలిసి పాల్గొంటే ఉద్రిక్తలు రెచ్చగొట్టే అవకాశం ఉందని, విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు.

03/22/2018 - 02:20

విజయవాడ, మార్చి 21: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సిరీస్ 2017 విజేత కిడాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. స్పోర్ట్సు కోటా కింద ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు గ్రూప్-1 సర్వీసెస్‌లో నియమించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. 30 రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.

03/22/2018 - 00:47

అమరావతి, మార్చి 21: కేంద్రంపై జపాన్ తరహా పోరాటానికి సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాస ప్రాంగణంలో సాధికార మిత్రలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ జపాన్ పోరాటాల మాదిరిగా గంట ఎక్కువ పనిచేసి, అరగంట నిరసన ప్రకటిద్దామని ప్రతిపాదించారు. రాష్ట్రం కోసం ఎవరు శాంతియుత పోరాటాలు చేసినా మద్దతిస్తామన్నారు.

Pages