S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/17/2017 - 04:19

పోలవరం, డిసెంబర్ 16: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల చిరకాల ఆకాంక్ష అని, కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను సిపిఐ నాయకుల బృందం పరిశీలించింది. విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మించాలని ఉన్నందున కేంద్రమే నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

12/17/2017 - 04:17

కాకినాడ, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే ఎన్నికల నాటికి బీజేపీని బలమైన శక్తిగా తయారుచేసేందుకు అధిష్ఠానం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పోలింగ్ బూత్‌ల వారీగా పటిష్టమైన కమిటీలను నియమించినట్టు తెలిపారు.

12/17/2017 - 04:15

విజయవాడ/్ధర్మవరం, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం నాటికి 500 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంది. ఇందుకు గుర్తుగా గొట్లూరుకు గ్రామంలో ఏర్పాటుచేసిన స్థూపాన్ని ఆవిష్కరించిన జగన్ అక్కడే మొక్క నాటారు.

12/17/2017 - 04:10

విజయవాడ, డిసెంబర్ 16: తెలంగాణా తరహాలో మన రాష్ట్రంలో కూడా కురుమ, యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి వారి సంక్షేమం కోసం తొలిదశగా వెయ్యి కోట్లు కేటాయించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు.

12/17/2017 - 04:10

విజయవాడ, డిసెంబర్ 16: ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చి నవ భారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తుల పార్టీ కాంగ్రెస్ అని పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.తులసిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

12/17/2017 - 04:09

విజయవాడ, డిసెంబర్ 16: విజయవాడ నగర శివార్లలోని మహ్మదీయ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు శనివారం మంత్రివర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. హజరత్ గాలీబ్ సాహెబ్ దర్గా భూములను మహ్మదీయ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ గతంలో వక్ఫ్‌బోర్డు నుంచి వేలంలో కొనుగోలు చేసింది.

12/17/2017 - 04:09

విజయవాడ, డిసెంబర్ 16: రాష్ట్ర డీజీపీ నియామక అధికారం మన పరిధిలోనే ఉండాలని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రిమండలి భేటీలో డీజీపీ నియామకం అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కర్నాటక, తెలంగాణలో డీజీపీలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకునేందుకు వీలు కల్పించిన కేంద్ర ం ఏపీకి మాత్రం ఇవ్వకపోవడాన్ని కొంతమంది మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం.

12/17/2017 - 04:09

భీమవరం, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రంగం అభివృద్ధికి క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఆక్వా సాగుచేసే తొమ్మిది జిల్లాల్లో 121 క్లస్టర్లుగా విభజించామన్నారు. ప్రతీ క్లస్టర్‌కు 1000 నుంచి 1500 హెక్టార్లు ఉంటాయని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యాంటిబయోటిక్స్ వినియోగం నిషిద్ధమన్నారు.

12/17/2017 - 04:07

విజయవాడ, డిసెంబర్ 16: రాష్ట్రంలో చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఉచితంగా ఈనెల 20 నుంచి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేస్తామన్నారు. త్వరలో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

12/17/2017 - 04:06

విజయవాడ, డిసెంబర్ 16: దేశ వ్యాప్తంగా గత 13 సంవత్సరాలుగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం వేర్వేరు దారుల్లో జరుగుతున్న ఆందోళన ఇక కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఉమ్మడి ఉద్యమంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం తీసుకున్న చొరవే కారణం కావటం గమనార్హం.

Pages