S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/13/2017 - 00:46

అమరావతి, డిసెంబర్ 12: కొందరు మంత్రులు జిల్లాలను సామంతరాజ్యాలుగా చేసుకుంటున్న తీరు అధికారపార్టీని విమర్శలపాలు చేస్తోంది. గతంలో వైఎస్ పాలనాతీరుపై విరుచుపడిన వారే ఇప్పుడు ‘అంతకుమించి’ సాగిస్తున్న హవా చివరకు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకే చిక్కులు తీసుకువస్తోంది.

12/13/2017 - 00:45

విజయవాడ, డిసెంబర్ 12: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న 27 మంది విద్యార్థులు డార్జిలింగ్‌లో రీనాక్ పర్వతాన్ని (6.400 మీటర్స్) అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వచ్చిన సందర్భంగా వారిని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అభినందించారు. మంగళవారం మంత్రి నక్కా ఆనందబాబును ఆయన చాంబర్‌లో రీనాక్ పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థులు కలిశారు.

12/13/2017 - 00:45

అమరావతి, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశాలంటే అధికారులు ‘వణికిపోతున్నారు’. అవును.. చంద్రబాబునాయుడు కొలువుదీరే సచివాలయంలోని ఆయన చాంబరు, కాన్ఫరెన్సు హాలు, కొత్తగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన ఉన్నంత సేపు ఎయిర్‌కండిషన్ 18 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుంది. సీఎం నిర్వహించే ఎలాంటి సమావేశమయినా, సమీక్షయినా రెండు గంటలకు తక్కువకాకుండా ఉంటాయి.

12/13/2017 - 00:44

విజయవాడ, డిసెంబర్ 12: విదేశీ పర్యటనలో భాగంగా కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ రెండు రోజులు కువైట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మంత్రి పితానికి కువైట్‌లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. డిసెంబర్ 9న మంత్రి పుట్టినరోజు కావటంతో మంత్రితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

12/12/2017 - 04:17

రాజమహేంద్రవరం, డిసెంబర్ 11: పోలవరం ప్రాజెక్టు కేంద్రం దయ కాదని, రాష్ట్ర ప్రభుత్వం హక్కుగా పూర్తిచేయాల్సి ఉందని అఖిల పక్షం నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం విశ్వసనీయత కోల్పోవడం వల్లే పోలవరానికి ఈ దుర్గతి పట్టిందన్నారు. కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఎందుకు రాష్ట్రం నెత్తినేసుకుందని నిలదీశారు.

12/12/2017 - 04:15

ఒంగోలు,డిసెంబర్ 11:రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని శాంతి భద్రతలను కాపాడుతున్నామని రాష్ట్ర హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. సోమవారం ఒంగోలులోని ఎస్‌పి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

12/12/2017 - 04:14

ఆత్మకూరు, డిసెంబర్ 11: ఎన్నికలు వస్తేనే బాబుకు మైనార్టీలు, వారి సమస్యలు గుర్తుకొస్తాయని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 32వ రోజు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఒడ్డుపల్లిలో నిర్వహించిన మైనారిటీలతో ముఖాముఖిలో జగన్ మాట్లాడుతూ మైనారిటీలంటే బాబుకు చిన్నచూపని అన్నారు.

12/12/2017 - 03:52

హైదరాబాద్, డిసెంబర్ 11: వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా తులగామ గ్రామంలో 115 మంది గ్రామస్తుల ఇళ్లు శుక్రవారం వరకూ ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ , జస్టిస్ జి శ్యాం ప్రసాద్‌లతో కూడిన బెంచ్ రామకృష్ణారావు తదితరులు దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించి ఈ ఆదేశాలు ఇచ్చారు.

12/12/2017 - 03:49

తిరుపతి, డిసెంబర్ 11: ప్రమాదవశాత్తూ విద్యుత్‌లైన్ తగలడంతో విద్యార్థికి గాయాలైన సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివారాలు ఇలా ఉన్నాయి. మునిసిపల్ పరిధిలోని బత్తలవారి కండ్రిగలో నివాసం ఉంటున్న ఎస్.బాబు (17), స్థానిక ఎస్ ఆర్ ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

12/12/2017 - 03:48

విజయవాడ, డిసెంబర్ 11: ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సంయుక్త నిర్వహణలో జనవరి 1 నుంచి 11 వరకు విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో నవ్యాంధ్ర పుస్తక సంబరాలు జరుగబోతున్నాయి.

Pages