S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/17/2017 - 04:07

కడప, మార్చి 16: కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో వైకాపా పోటీ చేస్తున్న ఏకైక స్థానం ఇదే కావడం గమనార్హం. జిల్లాలో స్థానిక సంస్థల్లో పూర్తిబలం ఉన్న వైకాపా గెలుపుపై కొండంత ధీమాగా ఉండగా, మారిన సమీకరణల నేపధ్యంలో విజయం తమనే వరిస్తుందని టిడిపి భరోసాగా ఉంది. దీంతో ఈ ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది.

03/17/2017 - 03:23

విజయవాడ, మార్చి 16: చేనేత కార్మికుల సంక్షేమంపై గురువారం శాసనసభలో వాడివేడి చర్చ సాగింది. బడ్జెట్‌తో ప్రమేయం లేకుండానే ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటనపై ప్రతిపక్ష వైకాపా సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

03/17/2017 - 03:21

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 16: నవ్యాంధ్రప్రదేశ్‌ను మోదీ మార్కు విధానాలతో అవినీతి రహిత...అభివృద్ధి సహిత సంక్షేమప్రదేశ్‌గా మార్చేందుకు ప్రయత్నిసున్నామని, దీనిలో భాగంగానే కేంద్ర నుండి అనేక సంస్థలతో పాటు పెద్ద ఎత్తున నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తీసుకు వస్తున్నట్లు శాసన మండలిలో బిజెపి సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది..

03/17/2017 - 03:20

విజయవాడ, మార్చి 16: పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా.. కృష్ణాకు గోదావరి జలాల తరలింపు.. అదేదో తమ ఘనకార్యంగా తెలుగుదేశం ప్రభుత్వం గొప్పలు చెప్పుకోటం హాస్యాస్పదం.. జాతీయ హోదా యుపిఎ ప్రభుత్వం పుణ్యం.. గోదావరి జలాల తరలింపునకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆద్యుడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా గురువారం పోలవరంపై అరగంటకు పైగా వాడి, వేడి చర్చ జరిగింది.

03/17/2017 - 03:18

విజయవాడ, మార్చి 16: గడచిన మూడేళ్లలో ఎక్కడా కనీసం ఒక్క గృహ నిర్మాణం కూడా పూర్తికాలేదు.. అయితే గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని పూర్తి అవాస్తవాలతో లక్షా, 35వేల గృహాలను నిర్మించామంటూ లిఖిత పూర్వక సమాధానమిస్తూ సభను తప్పుదారి పట్టిస్తున్నారంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పుల చెరిగారు. ఓ దశలో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.

03/17/2017 - 02:51

విజయవాడ, మార్చి 16: ఆంధ్రప్రదేశ్ అనాథ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడంపై ప్రధాని, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియచేసే తీర్మానాన్ని రాష్ట్ర శాసన మండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే మిన్నగా ప్యాకేజీ ఇచ్చారన్నారు.

03/17/2017 - 02:48

అమరావతి, మార్చి 16: ఒక్కోసారి పార్టీ నాయకత్వాలు తీసుకునే నిర్ణయాలు తెలియకుండానే ఎదురుదెబ్బగా మారుతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపార్టీ నేతల వేధింపులకు గురయి, జైళ్లకూ వెళ్లొచ్చిన కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా.. తమను వేధించి కేసులు పెట్టించిన వారికే తమ నాయకత్వం పదవులిచ్చి పెద్దపీట వేస్తే, వారి మనోభావాలు ఎలా ఉంటాయి? రాజధాని అమరావతిలోని తుళ్లూరు దొండపాడు తమ్ముళ్ల మాదిరిగా ఉంటాయి!

03/17/2017 - 02:44

న్యూఢిల్లీ, మార్చి 16: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం విదేశానికి బయల్దేరారు. ఆరోగ్య పరీక్షల కోసం ఇప్పటికే విదేశంలో ఉన్న తన తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తోడుగా ఉండటంతో పాటు, తిరుగు ప్రయాణంలోనూ ఆమెతో ఉండటానికి రాహుల్ వెళ్లారని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు.

03/17/2017 - 02:43

అమరావతి, మార్చి 16: దేశంలోనే తొలిసారి నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు యువత కృతజ్ఞతలు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేలా, భవితకు బంగారు బాట వేసేలా రూ.500 కోట్లు కేటాయించినందున తమ సంతోషం వ్యక్తం చేసేందుకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి గురువారం సాయంత్రం యువకులు తరలివచ్చారు.

03/17/2017 - 00:26

విజయవాడ, మార్చి 16: విద్యార్థుల ఆత్మహత్యలపై సభా సంఘాన్ని నియమించాలని కొంతమంది ఎమ్మెల్సీలు పట్టుబట్టినప్పటికీ, అందుకు మండలి చైర్మన్ చక్రపాణి నిరాకరించారు. ఇప్పటికే నియమించిన ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఆదేశించారు.

Pages