S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2017 - 01:52

విశాఖపట్నం, మార్చి 18: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ)ని ప్రైవేటీకరించబోమని సెంట్రల్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్, షిప్పింగ్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్య స్పష్టం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం మాందవ్య శనివారం విశాఖ నగరానికి వచ్చారు. డిసిఐ కార్యాలయంలో సిఎండి రాజేష్ త్రిపాఠి డిసిఐ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

03/19/2017 - 01:49

విశాఖపట్నం, మార్చి 18: తీర భద్రతను నిర్లక్ష్యం చేయడం వలనే ముంబై దాడులు సంభవించాయని, దీని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు.

03/19/2017 - 01:44

తిరుపతి, మార్చి 18: చిన్న పిల్లల నుంచి మహిళల వరకు అందర్నీ విలన్లుగా జుగుప్సాకరంగా చూపిస్తున్న టీవి సీరియల్స్ తీరు మారాలని, ఇందుకోసం తాము మానవహక్కుల కమిషన్, సెన్సార్ బోర్డు దృష్టికి ఈవిషయాన్ని తీసుకువెడతామని మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.

03/19/2017 - 01:44

ఒంగోలు,మార్చి 18:రానున్న 2019 ఎన్నికలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్‌డైగా మారాయి. రానున్న ఎన్నికల్లో గెలుపుకోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అంటున్నాయి వైకాపా శ్రేణులు. ఈపాటికే సిపిఎం పార్టీతో పొత్తుల వ్యవహరంపై వైకాపా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఐ రాష్టన్రేతలతో సంప్రదింపులు జరిపిన తరువాత రెండు వామపక్షాలతో ఎన్నికల పొత్తుకు వైకాపా సై అననుంది.

03/19/2017 - 01:43

కర్నూలు, మార్చి 18: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి జూన్‌లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో భారత రాష్టప్రతి ఎన్నిక నిర్వహించనున్నందున ఆ ఎన్నిక నాటికి దేశంలో ఎక్కడా శాసనసభ, పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఖాళీలు ఉండకూడదని, అన్నింటికీ ఉప ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

03/19/2017 - 01:42

రాజమహేంద్రవరం, మార్చి 18: టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ విభాగంలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. భవన నిర్మాణంపై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి దానిని ఎపి ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయాలనే నిబంధన తాజాగా అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. భవన నిర్మాణాన్ని ఆన్‌లైన్‌లో సమీక్షించే విధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధన అమల్లోకి రానుంది.

03/18/2017 - 04:39

విజయవాడ, మార్చి 17: ఏడాదిలోగా ప్రతి గ్రామంలో ఎల్‌ఇడి ట్యూబులైట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం రాత్రి అమరావతిలో ఎల్‌ఇడి ట్యూబులైట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని సిఎంవో నుంచి ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని మందడం, వెలగపూడి గ్రామస్తులకు ముఖ్యమంత్రి ఎల్‌ఇడి ట్యూబులైట్లు పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో బల్బు, ఫ్యాను, ఎల్‌ఇడి ట్యూబులైటు ఉండాలని కోరారు.

03/18/2017 - 04:38

విజయవాడ, మార్చి 17: తమ డిపాజిట్లు ఇప్పించాలని, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం చేసి, అవ్వాస్ సోదరులను అరెస్టు చేయాలని కోరుతూ నగరంలో జరుగుతున్న బాధితుల నిరవధిక దీక్షలను పోలీసులు కకావికలం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని 11రోజులుగా రిలే దీక్షలు, మూడురోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నారు.

03/18/2017 - 04:38

విజయవాడ (క్రైం), మార్చి 17: సమాజంలో అవినీతికి పాల్పడేవారే అంటరానివారని, లంచం తీసుకున్న వ్యక్తి పట్ల కుటుంబంలో, సమాజంలో, పనిచేసే కార్యాలయాల్లోనూ గౌరవం ఉండదని ఏపి అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ అన్నారు. గడిచిన మూడు నెలల్లో రాష్ట్రంలో అవినీతిని అదుపు చేయగలిగామన్నారు. ఏసిబి శాఖకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటుకు సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు.

03/18/2017 - 04:31

రాజమహేంద్రవరం, మార్చి 17: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోన్న చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో శుక్రవారం భారీ స్థాయిలో జగన్నాధ రధయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక, సంస్కృతీ, సంప్రదాయాల జానపద నృత్యాలు, లొట్టి పిట్టలు, శే్వత అశ్వాల పల్లకీల రథయాత్ర కనుల పండువగా సాగింది.

Pages