S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/16/2017 - 03:18

విజయవాడ, జనవరి 15: మన దేశం నుంచి హజ్ యాత్రకు గత ఏడాది లక్షా 36 వేలుగా వున్న కోటా ఈ ఏడాది లక్షా 70 వేలకు పెరిగింది. అంటే అదనంగా మరో 34వేల మంది హజ్ యాత్ర చేయడానికి అవకాశం లభించింది. గత 30 ఏళ్లలో ఇంత భారీస్థాయిలో కోటా పెరగడం ఓ రికార్డు. ఈ ఏడాది హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోడానికి ఈ నెల 24 చివరి తేదీ. ఇప్పటి వరకు 13 జిల్లాల నుంచి 1360 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.

01/16/2017 - 02:57

గుంటూరు (కల్చరల్), జనవరి 15: ప్రకృతి, పర్యావరణం, భూమిని పరిరక్షించడమంటే భగవంతుని ఆరాధించడమేనని విశ్వగురు పీఠాధిపతి శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఉద్బోధించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం రాత్రి నగరంలో రెండు ప్రధాన ఆలయాల్లో జరిగిన మకరజ్యోతి దర్శనం కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు సందేశమిచ్చారు.

01/16/2017 - 02:55

తిరుపతి, జనవరి 15: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆదివారం తిరుమలలో పార్వేటి ఉత్సవం కన్నుల పండువగా సాగింది. మకర సంక్రమణ మరుసటి రోజైన కనుమ రోజున తిరుమల పార్వేటి మండపం వద్ద ఈ ఉత్సవం నిర్వహించడం టిటిడికి ఆనవాయితీ. పార్వేటి ఉత్సవం అంటే స్వామివారు వేటకు వెళ్లే దృశ్యం.

01/16/2017 - 02:52

అచ్చంపేట/మాచర్ల, జనవరి 15: సంక్రాంతి పండుగవేళ ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. సెలవుల సందర్భంగా ఆటలాడుకుంటూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్న చిన్నారులు మృత్యుకుహరంలోకి జారుకుని విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరుల కంటతడి పెట్టిస్తోంది. గుంటూరు జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు.

01/16/2017 - 02:52

అనకాపల్లి, జనవరి 15: సంక్రాంతి పండగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, ఎస్.రాయవరం మండలాల్లో ఆదివారం సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

01/16/2017 - 02:50

విజయవాడ, జనవరి 15: అమరావతి నిర్మాణ ప్రక్రియ నిరాటంకంగా, నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎపి సిఆర్‌డిఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఆయన ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

01/16/2017 - 02:49

న్యూఢిల్లీ, జనవరి 15: ఎన్నికలు ముగిసే దాకా అయిదు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులు, చట్టబద్ధ సంస్థల్లో నియమించబడిన రాజకీయ నాయకులు జనం దాఖలు చేసే ఫిర్యాదులను వినకూడదు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలు ఓటర్లపై నేరుగా ప్రభావం చూపిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

01/14/2017 - 03:54

విశాఖపట్నం, జనవరి 13: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జరిగే కోడి పందేలకు విశాఖలోనూ ఆతిధ్యం లభించింది. నగరంతో పాటు శివారు మండలాలు, మారుమూల గ్రామాల్లో పందేల నిర్వహణకు వేదికలు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో నగర శివారులోని ఆరిలోవ, ఆనందపురం, పద్మనాభం, మండలాల్లో కోడి పందేల నిర్వహణ శుక్రవారం జోరుగా సాగింది. పందెం రాయుళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

01/14/2017 - 03:53

నాగాయలంక, జనవరి 13: స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద గల పుష్కర ఘాట్ సంక్రాంతి సంబరాలకు వేదికగా నిలిచింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దివిసీమ సంప్రదాయ రాష్ట్ర స్థాయి పడవల పోటీతో పాటు వివిధ పోటీలు శుక్రవారం నిర్వహించారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో స్వచ్ఛ నాగాయలంక, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ సంయుక్త సహకారంతో ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి.

01/14/2017 - 03:51

రామచంద్రాపురం, జనవరి 13: పశువుల పండుగకు రెండోరోజుల ముందుగానే చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం అనుప్పల్లి గ్రామంలో భోగి పండుగ నాడే శుక్రవారం ఆ గ్రామస్థులు జల్లికట్టు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే పశువుల పండగనాడు ఈ జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీ. అయితే అనుప్పల్లిలో మాత్రం శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఈ పోటీలు జరిగాయి.

Pages