S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/19/2017 - 08:36

శ్రీ కాళహస్తి, జనవరి 18: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన గాలిగోపురం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ గోపుర ప్రారంభ సూచికగా గురువారం నుంచి విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞం జరుగనుంది. 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అతిరుద్రయాగం నిర్వహించడానికి నవయుగ నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసింది. సుమారు రూ.50 కోట్ల రూపాయల వ్యయంతో నవయుగ నిర్మాణ సంస్థ ఈ గాలిగోపురాన్ని నిర్మించింది.

01/19/2017 - 07:39

విజయవాడ, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫైనాన్స్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం, సిసిఎల్‌ఎ కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠాల్లో ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. తాజాగా ప్రస్తుత సిఎస్ టక్కర్ సెలవుపై వెళ్లనున్నట్లు సమాచారం.

01/19/2017 - 08:18

అమరావతి, జనవరి 18: మీ వీధిలో లైట్లు వెలగడం లేదా! అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదా! మీ ఇంటిముందు డ్రైనేజీలో మురికి పేరుకుపోయిందా! మీ ఇంటిముందు రోడ్డు చెత్తకూపంలో ఉందా..! అనుమతిలేకుండా అడ్డదిడ్డంగా భవన నిర్మాణం జరుగుతోందా! ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారా! ఇలా పలు సమస్యలను చూస్తే ఆవేదన, ఆక్రోశం రాక మానదు.. వీటన్నిటికీ ఒకే పరిష్కారం... అదే ‘పురసేవ’ యాప్!

01/19/2017 - 07:34

అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న పెట్రోలియం యూనివర్శిటీలో భాగస్వామి కావాలని చమురు, సహజవాయు, రిఫైనరీ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ ఆరాంకో సంస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం సౌదీ ఆరాంకో సంస్థ ప్రెసిడెంట్, సీఈవో అమిన్ హెచ్ నాసర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

01/18/2017 - 05:18

న్యూఢిల్లీ, జనవరి 17: ఏపీ విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని 89 ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, కార్పొరేషన్‌ల విభజన, పంపకాలపై మంగళవారం కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయి. సంస్థలకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని రెండు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది.

01/18/2017 - 05:18

అనంతపురం, జనవరి 17 : డిటోనేటర్లు పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు..

01/18/2017 - 05:17

హైదరాబాద్, జనవరి 17: తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపడటానికి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నేత కార్మికుల కష్టాలను విని చలించి పోయారు.

01/18/2017 - 05:17

పలమనేరు, జనవరి 17: పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో ప్రజ లు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాం తాల్లో తరచూ పంట పొలాలపై దాడులు చేసి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నా ఈ ఏనుగుల గుంపు ఏకంగా గ్రామాలలోకే వస్తుండడంతో అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.

01/18/2017 - 05:16

అవుకు, జనవరి 17: విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు గాను గ్రామంలో తనిఖీలకు వెళ్లిన విద్యుత్‌శాఖ అధికారులపై ప్రజలు కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం అన్నవరంలో మంగళవారం జరిగింది. డోన్ డివిజన్ విద్యుత్‌శాఖ అధికారులు అన్నవరం గ్రామంలోని ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ నమోదు చేపట్టారు. కొన్ని ఇళ్లలో మీటర్లు లేకపోవడం గమనించారు.

01/18/2017 - 05:16

న్యూఢిల్లీ, జనవరి 17: చార్టర్డ్ అకౌంటెంట్స్(సీఎ)ఫైనల్ ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దేవరాజరెడ్డి మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. సిఎ ఫైనల్ ఫలితాలలో గ్రూప్-1 విభాగంలో 2,655 (7శాతం), గ్రూప్-2 విభాగంలో 4,245 (12శాతం)మంది ఉత్తీర్ణులైనట్టు ఆయన ప్రకటించారు.

Pages