S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/31/2016 - 03:51

విజయవాడ, డిసెంబర్ 30: ఇక పిడుగులనూ ముందుగానే గుర్తించవచ్చు. పిడుగు పడే ప్రాంతాన్ని 45 నిమిషాల ముందుగానే హెచ్చరిక సందేశాలను పంపే సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానుంది. పిడుగులు పడితే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. విపత్తుల ద్వారా ఏటా మృతి చెందుతున్నవారిలో ఎక్కువ మంది పిడుగుపాటు వల్లే అని జాతీయ క్రైం రికార్డ్సు బ్యూరోలో నమోదైన గణంకాలు తెలియచేస్తున్నాయి.

12/31/2016 - 03:47

ఏలూరు, డిసెంబర్ 30: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టమైన కాంక్రీట్ నిర్మాణ పనులు శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ముందుగా పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మాణ ఏజెన్సీ సమావేశ మందిర ప్రాంతానికి చేరుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవిఘ్నంగా జరగాలని కోరుకుంటూ హోమం నిర్వహించారు.

12/31/2016 - 03:22

కాకినాడ, డిసెంబర్ 30: ఓవైపు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపిన పోలీసు యంత్రాంగం, మరోవైపు కాకినాడ తీరంలో పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఎక్కడిక్కడే నిరసనకారులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించిన అధికారులు, ఇదే సమయంలో తీరంలో పోర్టు నిర్మాణంపై ప్రజల నుండి అభిప్రాయలను సేకరించారు.

12/31/2016 - 03:20

విజయవాడ, డిసెంబర్ 30: వివిధ రంగాలలో సాధించిన ప్రగతి ప్రామాణికంగా గ్రామాలకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం తన నివాసం నుంచి ‘జన్మభూమి - మా వూరు’పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధికి అనుగుణంగా గ్రామాలకు 3స్టార్, 5స్టార్, 7స్టార్ రేటింగ్‌లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

12/31/2016 - 03:16

పోలవరం, డిసెంబర్ 30: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న పోలవరం కాంక్రీటు పనుల ప్రారంభోత్సవ సంరంభంలో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సభకు జనంతో తరలివస్తున్న ఒక స్కూలు బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఒక బైక్‌ను ఢీకొని, రాళ్లను ఢీకొని నిలిచిపోవడంతో లోయలో పడిపోయే ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒక మండల వ్యవసాయాధికారి మృతిచెందగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

12/31/2016 - 03:13

విశాఖపట్నం, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తుగ్లక్ చర్యగా ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో విమర్శించారు. విశాఖలో ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ 50 రోజుల గడువులోగా పరిస్థితులు సర్దుకుంటాయని, లేనిపక్షంలో ప్రజలు విధించే శిక్షకు సిద్ధమని ప్రధాని ప్రకటించారని, దేశంలో ఇప్పటికీ నగదు ఇబ్బందులు తప్పట్లేదని, ప్రధాని మోదీకి ఏ శిక్ష విధించాలని ప్రశ్నించారు.

12/31/2016 - 03:12

తిరుపతి, డిసెంబర్ 30: ఏపిపిఎస్‌సి ద్వారా 4వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అన్ని విభాగాల్లో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అర్హులైనవారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ఏపిపిఎస్‌సి చైర్మన్ పిన్నమనేని భాస్కర్ వెల్లడించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా ఆయన గురువారం తిరుమలకు చేరుకున్నారు.

12/31/2016 - 03:11

విశాఖపట్నం, డిసెంబర్ 30: బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుపై విపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే మంత్రి గంటాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ వైకాపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

12/31/2016 - 03:11

సబ్బవరం, డిసెంబర్ 30: విశాఖ జిల్లా అనకాపల్లి- అనందపురం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధరపై నాలుగు రెట్ల నష్టపరిహారం అందిస్తామని 16వ నెంబర్ జాతీయ రహదారుల సంస్థ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ ఎ.సుబ్బరాజు పేర్కొన్నారు. శుక్రవారం పెదనాయుడుపాలెం రైతులతో జరిపిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ రైతులు ఈవిషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

12/31/2016 - 03:10

విశాఖపట్నం, డిసెంబర్ 30: ప్రస్తుతం విజయనగరం జిల్లా ట్రెజరీ శాఖ డిడిగా పనిచేస్తున్న గీతాదేవిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆమె చింతపల్లి సబ్ ట్రెజరీలో పనిచేస్తూ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల చెల్లింపుకుంభకోణంలో రూ.8 కోట్ల వరకూ అక్రమాలు జరిగినట్టు విచారణలో వెల్లడైంది.

Pages