S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/31/2016 - 01:14

విజయవాడ, డిసెంబర్ 30: మోరీ గ్రామ స్ఫూర్తిగా రాష్ట్రంలో మరిన్ని గ్రామాలు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో స్మార్ట్ విలేజ్‌పై శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ విలేజ్‌ల రూపకల్పనకు ప్రతిపాదనలను బెర్కలీలోని కాలిఫోర్నియా వర్సిటీ అధికారులు సిఎంకు వివరించారు.

12/30/2016 - 05:44

విజయవాడ (ఇంద్రకీలాద్రి), డిసెంబర్ 29: భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది సందర్భంగా అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌లో శ్రీ త్రిదండి రామానుజ చిన జియర్ స్వామీజీకి అరుదైన గౌరవం లభించింది.

12/30/2016 - 05:41

గుంటూరు, డిసెంబర్ 29: ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడే వారి బ్యాగులు ఇక గుట్టు రట్టు కానుంది. పోర్టులు, విమానాశ్రయాల నుంచి తరలివెళ్ళే కంటైనర్లు, లగేజ్ బ్యాగుల్లో అనధికారిక సామాగ్రిని పసిగట్టే అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞనంతో రూపొందించిన స్కానర్లను ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ శాఖ ప్రవేశపెట్టింది. త్వరలో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో అందుబాటులోకి రానున్నాయి.

12/30/2016 - 05:39

అమరావతి, డిసెంబర్ 29: ‘రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్‌కు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వడం ద్వారానే జవాబు చెబుతాం. పురాణాల్లోనూ జగన్ లాంటి రాక్షసులు హోమాలకు అడ్డుపడేవాళ్లు. చివరకు వారంతా ఏమయ్యారు? జగన్‌కూ అదే గతి పడుతుంది. పోలవరం పూర్తయితే జగన్ పార్టీకి పుట్టగతులుండవు.

12/30/2016 - 05:39

విజయవాడ, డిసెంబర్ 29: నగదు రహిత డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తూ దేశంలోనే కృష్ణా జిల్లాను మొదటి స్థానంలో నిలిపి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిన జిల్లా కలెక్టర్ బాబు.ఎను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్మానించనున్నారు. ఢిల్లీలోని టలకటోర స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.

12/30/2016 - 05:38

విజయవాడ, డిసెంబర్ 29: కొత్త సంవత్సరంలో కొత్తమార్పుకు నాంది పలకాలని, మార్పు లేనిదే అభివృద్ధిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం తన నివాసం నుంచి నగదు రహిత లావాదేవీలు, జన్మభూమిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

12/30/2016 - 05:37

విజయవాడ, డిసెంబర్ 29: గాలేరు - నగరి ప్రాజెక్టు ఫేజ్-1లో భాగమైన గండికోట జలాశయానికి రెండున్నరేళ్లలోనే ఇంతస్థాయిలో నీరు వస్తుందని జగన్ ఊహించి ఉండలేదని, గండికోట నీరు పులివెందుల భూముల్లో జనవరిలోనే పారబోతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు చెప్పారు.

12/30/2016 - 05:37

విశాఖపట్నం, డిసెంబర్ 29: నీటి సంరక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజితా సారంగి పేర్కొన్నారు. గురువారం విశాఖలో రాష్టస్థ్రాయి నీటి పొదుపుమిషన్‌పై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య ప్రసంగం చేశారు.

12/30/2016 - 05:32

కడప,డిసెంబర్ 29: కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నిర్వాసితులు గత నాలుగు రోజులుగా నిరాటంకంగా నిరసన తెలుపుతున్నారు. పరిహారం చెల్లించాలంటూ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గండికోటకు కృష్ణాజలాలు తరలించడంతో జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం 3.5 టిఎంసిల నీరు చేరింది. దీంతో ఇప్పటికే గండ్లూరు, చౌటపల్లె, బొమ్మెనపల్లె గ్రామాల్లోకి నీరు చేరింది.

12/30/2016 - 05:30

గుంటూరు, డిసెంబర్ 29: దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత ఆలయ దర్శనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోందని రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇందుకోసం అద్దె ప్రాతిపదికన దేవాదాయశాఖకు బస్సులు కేటాయిస్తామన్నారు. ప్రతి బస్సులో సుశిక్షితులైన ఇద్దరు డ్రైవర్లతో పాటు ఒక అటెండర్‌ను నియమిస్తామని చెప్పారు.

Pages