S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/31/2016 - 03:09

విజయవాడ, డిసెంబర్ 30: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమికను పోషిస్తూ వస్తున్న రాజధాని నగర అభివృద్ధి మరియు నిర్వహణ సంస్థ ‘సిసిడిఎంసి’ శుక్రవారం నుంచి అమరావతి అభివృద్ధి సంస్థ ‘ఏడిసి’గా తన కార్యకలాపాలను ప్రారంభించింది.

12/31/2016 - 03:09

విజయవాడ, డిసెంబర్ 30: సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ)లో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలను పెంచింది. 35 శాతం మేర జీతం పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబును సెర్ప్ సిఇఒ కృష్ణమోహన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

12/31/2016 - 03:08

విజయవాడ, డిసెంబర్ 30: వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం శనివారం సమావేశం కానుంది. జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమం ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. కొత్తగా మంజూరు చేయనున్న రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు, పింఛన్ల పంపిణీకి నగదు సిద్ధం చేయడం వంటి అంశాలు చర్చకురానున్నాయి. రిజర్వు బ్యాంక్ నిబంధనల కారణంగా గతంలో పింఛన్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

12/31/2016 - 02:34

తిరుపతి, డిసెంబర్ 30: ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని జనవరి 1వ తేదీన వి ఐ పిలకు, ముఖ్య అధికారులకు ప్రాధాన్యత దర్శనం టికెట్లను క్రమబద్ధీకరించి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు కేటాయించడానికి చర్యలు చేపడుతున్నట్లు జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు.

12/31/2016 - 02:32

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 30: రాష్ట్ర ప్రజల చిరకాల కోరికైన పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లెక్కకు మించి సందేహాలున్నాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశనసభాపక్ష నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రాజెక్టు రిపోర్టులకు వాస్తవ పనులకు అసలు పొంతన లేదన్నారు.

12/31/2016 - 02:32

తిరుపతి, డిసెంబర్ 30: ఎర్రసంపదను పరిరక్షించాలంటే ప్రభుత్వంలోని అధికారుల అండ, అటవీశాఖ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పిస్తే ఒక్క ఎర్రచెట్టును కూడా నేలకు ఒరగినివ్వబోమని అటవీశాఖ అధికారి డిసిఎఫ్ మూర్తి చెప్పారు.

12/31/2016 - 02:31

విజయవాడ, డిసెంబర్ 30: మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో భర్తీకాని బెర్తులు, సీట్లను నింపేందుకు రైల్వేశాఖ గురువారం నుంచి తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. రైలులో రిజర్వేషన్ చేసుకున్న సమయంలో రిజర్వేషన్ చార్టు తుది ఖారారు అనంతరం ఖాళీగా మిగిలిపోయి వున్న సీట్లపై బేసిక్ చార్జీలో పది శాతం తగ్గింపు ఇస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది.

12/31/2016 - 02:30

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 31: మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం కొనసాగించి, దాన్ని ఇరువైపులా పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమెను కత్తితో గాయపరచి, తానూ గాయపరచుకున్న ఉన్మాది ఉదంతమిది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి...

12/31/2016 - 01:25

విజయవాడ, డిసెంబర్ 30: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటంలో కృషి చేస్తున్నందుకు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబును ప్రధాని మోదీ ప్రశంసించారు. ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన డిజిధన్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ బాబుకు ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు.

12/31/2016 - 01:16

గుంటూరు, డిసెంబర్ 30: నాగార్జునసాగర్ కుడికాల్వ ఆయకట్టు పరిధిలో రెండో పంటకు నీరివ్వటం కష్టసాధ్యమని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఆరుతడి పంటలకు మాత్రమే నీరందే అవకాశాలు ఉన్నాయన్నారు. సాగర్ రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నందున చివరి భూములకు నీరందించే వీలులేదని తేల్చిచెప్పారు. నీటి లభ్యత ఆధారంగా సాగు, తాగునీటికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

Pages