S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/30/2016 - 01:25

ఏలూరు, డిసెంబర్ 29: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో శుక్రవారం మరో ప్రతిష్ఠాత్మక అడుగు పడనుంది. ప్రధాన నిర్మాణమైన స్పిల్‌వే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంగరంగ వైభవంగా పోలవరం పండుగ రీతిలో కాంక్రీట్ పనులను ప్రారంభించనున్నారు. 1941లో రామపాదసాగర్ ప్రాజెక్టుగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఆ తర్వాత పరిణామాల్లో అధ్యయనాలు, సర్వేలు వంటి దశలను దాటుకుంటూ వచ్చింది.

12/30/2016 - 01:18

అమలాపురం, డిసెంబర్ 29: రాష్ట్రంలోని గ్రామాలన్నిటినీ దశలవారీగా డిజిటలైజ్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిజిటలైజేషన్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతోపాటు ప్రపంచం మొత్తం మన ముంగిట్లోకి వస్తుందన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫైబర్‌గ్రిడ్‌ను గురువారం ముఖ్యమంత్రి ప్రారంభించారు.

12/30/2016 - 01:15

విశాఖపట్నం, డిసెంబర్ 29: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించలేదన్న కారణంగా మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ఆస్తులను ఇండియన్ బ్యాంక్ గురువారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాదాపు రూ.200 కోట్ల మేర రుణాన్ని తీసుకుని సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి.

12/30/2016 - 01:13

అమలాపురం, డిసెంబర్ 29: ఇతర బిసి కులాలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల అంశాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. అయితే వారికి ఆ అవకాశం ఇవ్వనన్నారు.

12/29/2016 - 08:19

హైదరాబాద్, డిసెంబర్ 28: సినిమా థియేటర్లలో వివిధ తరగతులు టిక్కెట్ల రేట్లను నిర్ధారించే విషయమై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులు సమావేశమై విధి విధానాలను ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో వల్ల థియేటర్లకు నష్టం వస్తుందంటూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలంగో విచారించి పై ఆదేశాలు జారీ చేశారు.

12/29/2016 - 08:19

తిరుపతి, డిసెంబర్ 28: తన వద్ద ఉన్న సొమ్ము, సొత్తును కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకట్వేరస్వామికి సమర్పించి గత 45 సంవత్సరాలుగా స్వామి సేవలో తరిస్తూ తిరుమలలో ఉంటున్న మైథిలి స్వామి (98) మంగళవారం 9.30 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రిలో కన్ను మూశారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆయన పార్ధివదేహానికి ఆయన భక్తులు పాపవినాశనం రోడ్డు మార్గంలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

12/29/2016 - 08:18

అమరావతి, డిసెంబర్ 28: రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందన్నదానికి సచివాలయ ఉద్యోగుల తీరుపై సర్కారు అనుసరిస్తున్న మెతక వైఖరి నిదర్శనంగా నిలుస్తుంది. సర్కారు అన్ని శాఖల్లో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తుండగా, ఎక్కడా లేని విధంగా ఒక్క సచివాలయ ఉద్యోగుల నుంచే అభ్యంతరాలు, సహాయ నిరాకరణ ఎదురవడం చర్చనీయాంశమయింది.

12/29/2016 - 07:12

విజయవాడ, డిసెంబర్ 28: ఎపి నుంచి ఢిల్లీ సర్వీసులకు వెళ్లే ఐఎఎస్ అధికారుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ పి.వి.రమేష్ బదిలీ అయ్యారు. రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఇసి ఆఫ్ ఇండియా) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన ఆయన జనవరి నాలుగున రీలీవ్ కానున్నారు. కేంద్ర సర్వీసుకు వెళ్లాలని ఆయన దరఖాస్తు చేయలేదు.

12/29/2016 - 07:11

అమరావతి, డిసెంబర్ 28: ‘ఆ అధికారి వ్యవహారశైలి వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ తగ్గిపోతోంది. అయినా ఐఏఎస్ బదిలీలు ఆయన చేయడమేమిటి? సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వకపోవడమేమిటి? అసలు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా? అంతా సీఎంఓనే పరిపాలిస్తే ఇక మేమెందుకు? ఇలాగైతే ముఖ్యమంత్రి కల నెరవేరడం సాధ్యమా? అసలు ఇవన్నీ ఆయనకు తెలిసి జరుగుతున్నాయా?

12/29/2016 - 07:09

అనంతపురం, డిసెంబర్ 28: పరిశోధనల్లో వైఫల్యాలకు వెరవకుండా విద్యార్థులు తమలోని సామర్థ్యాలకు పదును పెట్టాలని, అంతరిక్ష పరిశోధనల్లో విజయాలు సాధిస్తూ సమాజాభివృద్ధికి దోహదపడాలని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డిఎస్‌సి), షార్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పి.కున్హికృష్ణన్ దిశానిర్దేశం చేశారు. అనంతపురం జెఎన్‌టియు 8వ స్నాతకోత్సవం సందర్భంగా పి.కున్షికృష్ణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

Pages