S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/01/2017 - 05:16

విజయవాడ, డిసెంబర్ 31: రాష్ట్రానికి 2016 సంవత్సరం కలిసొచ్చిందని, అమరావతి ఒక శక్తి పీఠమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. అమరావతికి వచ్చాక అన్ని కలిసి వస్తున్నాయని, 2017 సంవత్సరం కూడా ఆదే విధంగా కలసి రావాలని ఆకాంక్షించారు. ఇకపై శాసన సభా సమావేశాల నిర్వహణకు హైదరాబాద్ వెళ్లే ప్రసక్తి లేదని, ఎపి భవన్ వద్ద మావోలు రెక్కి నిర్వహించడంపై మాట్లాడేందుకు నిరాకరించారు.

01/01/2017 - 05:15

విశాఖపట్నం, డిసెంబర్ 31: బ్యాంకుల్లో తీసుకున్న రుణాల ఎగవేతకు పాల్పడిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు.

01/01/2017 - 05:14

అమరావతి, డిసెంబర్ 31: జన్మభూమి-మావూరు కార్యక్రమం ఓ పండగలా నిర్వహించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు. మీ విజ్ఞానాన్ని, అనుభవాలను, శ్రద్ధను దత్తత గ్రామాల అభివృద్ధిపై పెట్టాలి. మీ కుటుంబంపై, వృత్తిపై పెట్టే శ్రద్ధలో కొంతభాగం గ్రామాల అభివృద్ధిపై పెట్టాలి’ అన్నారు.

01/01/2017 - 05:13

కడప, డిసెంబర్ 31: పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో కడప జిల్లా గండికోట నిర్వాసితులు శనివారం దీక్ష విరమించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గండికోట రిజర్వాయర్ పునరావాసులకు పరిహారంగా రూ. రూ.479 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు.

01/01/2017 - 05:12

రామచంద్రపురం, డిసెంబర్ 31: జనవరి నెలలో కృష్ణా జిల్లా నూజివీడులో జరగనున్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అండర్-19 బాలుర, బాలికల క్రీడా జట్లలో పాల్గొనే క్రీడాకారుల పేర్లను శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.తాతబ్బాయి, పరిశీలకులు ఓలేటి సీతాపతిరావు, జంపన రఘురాం శనివారం ప్రకటించారు.

01/01/2017 - 05:12

రాజమహేంద్రవరం, డిసెంబర్ 31: అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద రూపొందించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి డి పి ఆర్ లేకుండానే శంకుస్థాపనకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏ ప్రాజెక్టు అయినా డిపిఆర్ లేకుండా చేపట్టడానికి వీల్లేదు. సాంకేతికంగా కూడా అది చెల్లదు.

01/01/2017 - 04:40

విజయవాడ, డిసెంబర్ 31: రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమాను కల్పించే దిశలో ప్రభుత్వం ముందడుగు వేసింది. జనవరి నుంచి ఆరోగ్య రక్ష పథకం కింద కొత్త పథకం రాష్ట్రంలో అమలు చేయనునున్నారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు కృతజ్ఞతలు తెలపాలని తీర్మానించారు. చుక్కల భూముల సమస్య పరిష్కారానికి చట్టం, గుజరాత్ తరహాలో భూసేకరణ చట్టానికి సవరణలు వంటి నిర్ణయాలు రాష్ట్ర మంత్రి వర్గం శనివారం తీసుకుంది.

01/01/2017 - 04:25

విజయవాడ, డిసెంబర్ 31: పట్టిసీమ నీటి ద్వారా 36వేల హెక్టార్లలో 37 నుంచి 45 బస్తాల ధాన్యం దిగుబడి సాధించినందులకుగాను కృతజ్ఞతగా అవనిగడ్డ నియోజకవర్గ రైతులు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ నాయకత్వంలో నడకుదురు శ్రీకృష్ణదేవాలయంలో కొత్తగా పండిన ధాన్యంతో పూజలు చేసి, పొంగల్ వండి, జున్ను వండి, అటుకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చి పూలకిరీటం, వరి కంకులతో గుత్తి ఇచ్చి సన్మానించారు.

01/01/2017 - 03:25

విజయవాడ, డిసెంబర్ 31: రైలు ప్రమాదంలో మరణించినవారికి రైల్వే యంత్రాంగం రెండింతలు నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించింది. ఈ విధానం నేటినుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటైన రైల్వే వ్యవస్థలో భారతదేశంలో ఏదో ఒక మూల తరచూ ప్రమాదానికి గురవుతూ వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సంగతి తెలిసిందే.

12/31/2016 - 03:52

అమరావతి, డిసెంబర్ 30: ఇప్పటివరకూ ఉద్యమంలో కలసి నడిచిన కాపు-బలిజల మధ్య దూరం పెరిగిన క్రమంలో కాపునేత ముద్రగడ రాసిన లేఖ బలిజలను మానసికంగా గాయపరిచినట్టయింది. బలిజ సొంత బాటపై వార్తలు రాస్తున్న మీడియాను ప్రభుత్వ పెంపుడు పత్రికంటూ ముద్రగడ లేఖ రాయడాన్ని బలిజలు సహించలేకపోతున్నారు. దానిపై బలిజ ఫ్రంట్ అధ్యక్షుడు రమణ నేరుగా ముద్రగడకు రాసిన లేఖ చర్చనీయాంశమయింది.

Pages