S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/17/2016 - 04:08

వాకాడు, డిసెంబర్ 16: బంగాళాఖాతం సముద్రంలో చేపలవేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరు నెల్లూరు జిల్లావాసులు. ఏడుగురు చెన్నైకు దగ్గరలోని కాశినేడుకు చెందినవారని తెలిసింది.

12/17/2016 - 04:08

గుంటూరు, డిసెంబర్ 16: పెద్దనోట్ల రద్దు రవాణాశాఖపై తీవ్ర ప్రభావం చూపిందని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు శాతం ఆదాయం కోల్పోయినట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీ నాటికి ఆర్టీసీకి రూ. 45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. శుక్రవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టామన్నారు.

12/16/2016 - 03:13

భీమవరం, డిసెంబర్ 15: రోజు రోజుకు పెరుగుతున్న కోతతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీర గ్రామాలు వణికిపోతున్నాయి. తుపాను సమయంలో కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం అనంతరం యథాస్థితికి చేరుకోవడం ఆ గ్రామాల వాసులకు నిత్యకృత్యమే. అయితే గత కొన్ని నెలలుగా కెరటాల ఉద్ధృతికి తీరం కోతకు గురవుతోంది. తీరంలోని కొబ్బరి తదితర తోటలు నెమ్మది నెమ్మదిగా కడలి ఒడిలో కలిసిపోతున్నాయి.

12/16/2016 - 03:10

అనంతపురం, డిసెంబర్ 15: అనంతపురం జిల్లాపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, సామాన్య, మధ్యతరగతి ప్రజల నోట్లు లభించక, చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమవుతున్నారు. నగదు కోసం ప్రతిరోజు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. పనులన్నీ వదులుకుని బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా రూ,2 వేలు, రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు.

12/16/2016 - 03:10

గుంటూరు, డిసెంబర్ 15: రాష్ట్రంలో కేబుల్ టివి సేవలకు సంబంధించిన మూడు, నాలుగో దశ డిజిటలైజేషన్ ప్రక్రియ గడువును వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కోరారు. ఈమేరకు గురువారం వెంకయ్య నాయుడుకు ఆయన లేఖ రాశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రాష్ట్రంలో పెద్దఎత్తున అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని కోరారు.

12/16/2016 - 03:09

శంఖవరం, డిసెంబర్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి సన్నిధి రత్నగిరిలో గురువారం మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆదేశాల మేరకు అన్నవరం దేవస్థానంలో మెట్లోత్సవాన్ని నిర్వహించినట్లు దేవస్థానం ఇఓ కాకర్ల నాగేశ్వరరావు తెలిపారు.

12/16/2016 - 03:08

ఏలూరు, డిసెంబర్ 15: కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య, మధ్యతరగతి జనం పడుతున్న కష్టాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. అయితే ఈనిర్ణయం తర్వాత ‘ప్రశాంతంగా’ వ్యాపారం చేసుకునే రేషన్ డీలర్ల పరిస్ధితి కుడితిలో పడ్డట్టు అయింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వీరిపాలిట ఒకరకంగా శాపంగా మారుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.

12/16/2016 - 03:06

విజయవాడ, డిసెంబర్ 15: ముందస్తు ఆలోచన.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన భారత ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్‌లో అభినవ తుగ్లక్‌గా చరిత్రకు ఎక్కబోతున్నారని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నిప్పులు చెరిగారు.

12/16/2016 - 03:05

గుంటూరు, డిసెంబర్ 15: ఓపక్క కేంద్రం సాక్షాత్తూ పార్లమెంట్‌లో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అవసరం లేదని స్పష్టం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వైపింగ్ మిషన్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

12/16/2016 - 03:05

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: పోలీసుశాఖలో తొలి నగదు రహిత లావాదేవీలకు విజయవాడ పోలీసు కమిషనరేట్ శ్రీకారం చుట్టింది. ఇది రాష్ట్రంలోనే తొలి ప్రయోగాత్మకంగా నగర పోలీసుశాఖ ప్రవేశపెడుతోంది. ఈమేరకు పలు బ్యాంకులు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. పోలీసుశాఖ నుంచి ప్రజలకు అందిస్తున్న 52రకాల సేవల కోసం వసూలు చేసే ఛార్జీలు, రుసుము ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు కొనసాగనున్నాయి.

Pages