S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/23/2016 - 02:18

విశాఖపట్నం, అక్టోబర్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌కు చెందినదేనని, దీనిపై ఇతర రాష్ట్రాలకు ఎటువంటి హక్కులు సంక్రమించవని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు స్పష్టం చేశారు. విశాఖలో దేవాదాయ శాఖ అధికారుతో శనివారం సమీక్షించిన ఆయన తనను కలిసి విలేఖరులతో మాట్లాడుతూ టిటిడి ఆదాయంలో తెలంగాణ వాటా కోరడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, ఇది అసంబద్దమని పేర్కొన్నారు.

10/23/2016 - 02:16

శ్రీకాకుళం, అక్టోబర్ 22: రాయలసీమకు సాగునీరు అందిస్తామంటూ చేపట్టిన పట్టిసీమ నిర్మాణం కేవలం చంద్రబాబు ప్రభుత్వం పర్సంటేజీల కోసమేనని ఎపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

10/23/2016 - 02:14

గూడెంకొత్తవీధి, అక్టోబర్ 22: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం మొల్లిమెట్ట, దుచ్చరిపాలెం గ్రామాల సమీపంలో శనివారం అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 220 తాబేళ్ళను ఫారెస్ట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. టేకు తోటలు, ఇతర కాఫీ ప్లాంటేషన్ల రక్షణలో భాగంగా శుక్రవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుండగా కనిపించిన మూటలు అనుమానంగా ఉండడంతో వాటిని పరిశీలించారు.

10/23/2016 - 02:10

విజయవాడ, అక్టోబర్ 22: సాగు పద్ధతుల్లో మెరుగైన విధానాలను అమలుపరచడం ద్వారా సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై అడుగులు వేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందుకోసం చర్యల్లో భాగంగా నవంబర్ నెల చివరి వారంలో అజీమ్ ప్రేమ్‌జీ సంస్థతో అజీమ్ ప్రేమ్‌జీ-ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం జరుగుతుందని ఆయన తెలిపారు.

10/23/2016 - 02:07

విశాఖపట్నం, అక్టోబర్ 22: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం పోర్టు బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యంగా 370 కిలోమీటర్ల వద్ద ఇది కేంద్రీ కృతమైందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రాగల 24 గంటల్లో ఇది క్రమంగా మయన్మార్ వైపు కదులుతూ తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు.

10/23/2016 - 02:06

అనంతపురం, అక్టోబర్ 22 : తుంగభద్ర జలాశయం నుంచి హెచ్‌ఎల్‌సికి రావాల్సిన వాటా నీటిలో భారీగా కోత పడుతుండటంతో ఆయకట్టు నానాటికీ తీసికట్టు అవుతోంది. దీంతో తాగునీటికి మినహా సాగునీటికి నీటి తీవ్రకొరత ఏర్పడింది.

10/23/2016 - 02:06

తిరుపతి, అక్టోబర్ 22: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్విమ్స్‌కు పంపించవద్దంటూ స్విమ్స్ యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చిన హెచ్చరిక నోటీసులపై హైకోర్టు శనివారం 8వ తారీఖులోపు ఇందుకు సంబంధించి పూర్తివివరాలు అందజేయాలని రాష్టవ్రైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, స్విమ్స్ డైరెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓకు నోటీసులు జారీచేసింది.

10/23/2016 - 02:05

ఏలూరు, అక్టోబర్ 22: భవిష్యత్తులో జరిగే ఎన్నికల నాటికి ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో వౌలిక వసతుల తీరుపై గూగుల్ మ్యాపింగ్ చేసి ఓటర్లకు ఆన్‌లైన్‌లోనే పోలింగ్ స్టేషన్ల వివరాలు పొందుపరుస్తామని ఎన్‌ఐసి టెక్నికల్ డైరెక్టర్ వైవికెఎస్‌ఆర్ మూర్తి చెప్పారు.

10/23/2016 - 02:04

విజయవాడ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ హీరో రాజేంద్రప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు.

10/22/2016 - 07:29

నాగులుప్పలపాడు/మనుబోలు/పుంగనూరు, అక్టోబర్ 21: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద శుక్రవారం ఆర్‌టిసి బస్సు ఆటో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న గుంజి అశోక్(16),బత్తుల లింగమ్మ(50), షేక్ జోసెఫ్(30) అక్కడికక్కడే మృతిచెందారు. ఈఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Pages