S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

,
10/24/2016 - 04:02

తిరుపతి, అక్టోబర్ 23: ప్రపంచంలో ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధిపథంలో నడుస్తుందని రాష్ట్ర డిప్యూటీ సిఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

10/24/2016 - 03:42

తాడిపత్రి, అక్టోబర్ 23: అనంతపురం జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రం పొలాచిలోని కబేళాకు లారీల్లో తరలిస్తున్న పశువులను విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తాడిపత్రి సమీపంలో ఆదివారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీల్లో సుమారు 60 పశువులను కుక్కి, బయటకు కనిపించకుండా ఉండేందుకు చుట్టూ టార్‌పాల్ కప్పారు. దీంతో ఊపిరాడక కొన్ని అపస్మారకస్థితికి చేరుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

10/24/2016 - 03:40

విజయవాడ, అక్టోబర్ 23: ఆక్వా రంగం, భారత ఆర్థిక వ్యవస్థను గూప్పవరంగా మారబోతున్నది. 8,129 కి.మీ సుదీర్ఘమైన తీరప్రాంతం గల భారతదేశంలో దాదాపు 31 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులను వినియోగించుకునే పరిస్థితి ఉంది. అన్నింటకంటే విశేషం ఏమిటంటే మెరైన్ ఉత్పత్తుల్లో దేశంలోకెల్లా అత్యున్నత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అయితే ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమల పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

10/24/2016 - 03:37

విశాఖపట్నం, అక్టోబర్ 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, టిడిపి తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని ఎపి పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

10/24/2016 - 03:37

ఉండి, అక్టోబర్ 23: రాష్ట్రంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మోడల్ పొలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఒక్కొక్క స్టేషన్ నిర్మాణానికి రూ.2 నుండి మూడు కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. అవసరమైన మేరకు నిధులు లభ్యతను బట్టి అధిక సంఖ్యలోనే నిర్మాణాలు చేపబడతామని వివరించారు.

10/24/2016 - 03:36

విజయవాడ, అక్టోబర్ 23: ఐక్యరాజ్య సమితి ఆశయాలు నెరవేరాలని, ప్రపంచం ప్రశాంత నిలయంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఐక్యరాజ్య సమితి ప్రారంభించే ప్రతి కార్యక్రమంలో భారత్ ముందుందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఇంధన పొదుపు ప్రపంచానికే ఆదర్శనమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పలు సందర్భాల్లో ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు.

10/24/2016 - 03:35

విశాఖపట్నం, అక్టోబర్ 23: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్‌కి తూర్పు దిశగా 420 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉందని, తీవ్ర వాయుగుండం మరో 24 గంటల్లో తుపాను బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది మయన్మార్ తీరం వైపు నెమ్మదిగా కదులుతోందని తెలిపారు.

10/24/2016 - 03:34

ఒంగోలు, అక్టోబర్ 23:రాష్ట్రంలో వైకాపా నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాపు నేత ముద్రగడ పద్మనాభం కులాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఒంగోలులో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పదవులు ఊడిన నేతలు కులాలను అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

10/23/2016 - 02:24

కాకినాడ, అక్టోబర్ 22: పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పిడి యాక్టు ప్రయోగించి, జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పాఠశాలలు దేవాలయాల కంటే పవిత్రమైనవని, ఏ గ్రామంలోనైనా దేవాలయం లేకపోయినా ఫర్వాలేదు కాని, పాఠశాల తప్పనిసరిగా ఉండాలని, వాటిని పవిత్రంగా కాపాడుకోవాలని హితవు పలికారు.

10/23/2016 - 02:23

గుంటూరు, అక్టోబర్ 22: రెయిన్‌గన్ల ద్వారా అనంతపురం జిల్లాలో కరవును పారద్రోలామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అనంతపురంలోని అన్ని మండలాలనూ కరవు ప్రాంతాలుగా ప్రకటించడాన్ని చూస్తే ఏ మేరకు కరవును జయించారో అర్థమవుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా కళ్లుతెరిచి కరవు ప్రాంతాలుగా ప్రకటించిన మండల రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Pages