S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/26/2016 - 03:36

తిరుమల, అక్టోబర్ 25: తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమలకు ఉత్తర దిక్కున ఉన్న తుంబురు తీర్థంలో మంగళవారం తెల్లవారుఝామున మంటలు చెలరేగాయి. మొదట మెల్లగా మొదలైన మంటలకు ఈదురు గాలులు తోడు కావడంతో పెనుప్రమాదంలా మారి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో శేష తీర్థం, పులుట్ల, కాకుల కొండ ప్రాంతాలకు మంటలు వేగంగా వ్యాపించి వేలాది ఎకరాలు కాలి బూడిదయ్యాయి.

10/26/2016 - 03:34

విశాఖపట్నం (గాజువాక), అక్టోబర్ 25: వీరోచిత పోరాటం చేస్తూ మావోయిస్టుల గుళ్ల వర్షం నుండి తప్పించుకునే ప్రయత్నంలోనే గ్రేహౌండ్స్ సీనియర్ కమాండెంట్ అబూబకర్ మృత్యువాత పడ్డారని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఎన్.సాంబశివరావు తెలిపారు. ఎవోబి సరిహద్దుల్లో సోమవారం మావోయిస్టులకు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో అబూబకర్ వీర మరణం పొందిన విషయం విదితమే.

10/26/2016 - 03:21

విశాఖపట్నం, అక్టోబర్ 25: రాష్ట్రానికి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు వాతావరణ శాఖ అధికారులు ‘కయాంత్‌‘ గా పేరుపెట్టారు. ప్రస్తుతం ఉత్తర ఈశాన్యంలో పోర్టు బ్లెయిర్‌కు చేరువగా ఉన్న తుపాను మంగళవారం నాటికి విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 770 కిమీ దూరంలో కొనసాగుతోంది.

10/25/2016 - 03:35

హైదరాబాద్, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణ ఆ పదవికి అనర్హుడని పేర్కొంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. శాసనసభ కార్యదర్శి పదవికి సత్యనారాయణకు అవసరమైన విద్యార్హతలు ఆయనకు లేవని పేర్కొంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

10/25/2016 - 03:34

విజయవాడ, అక్టోబర్ 24: నీరు-ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి, ఉద్యోగి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 18.4 శాతం వర్షపాతం లోటు ఉందని, ఒకరోజు వర్షం పడి మరోరోజు పడకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

10/25/2016 - 03:33

అనంతపురం టౌన్, అక్టోబర్ 24: అనంతపురం జిల్లాలో ఈ ఏడాది వెయ్యి ఆకలిచావులు జరిగాయని, వెంటనే స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించి వాటిని నివారించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో 600 జిల్లాలుండగా ఎక్కడాలేని విధంగా అనంతలో ఆకలిచావులు పెరుగుతున్నాయన్నారు.

10/25/2016 - 03:32

గుంటూరు, అక్టోబర్ 24: అధికార తెలుగుదేశం పార్టీలో ‘ఇసుక తుపాను’ రేగుతోంది. అధికారంలోకి వచ్చాక మూడు విడతలుగా ఇసుక విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. తొలుత ఆనవాయితీగా వస్తున్న వేలం విధానాన్ని కొనసాగించింది. అనంతరం డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగించింది.

10/25/2016 - 02:45

కర్నూలు, అక్టోబరు 24: కాపులను బిసిలో చేర్చే విషయమై కర్నూలులో సోమవారం జరిగిన మంజునాథ్ కమిటీ విచారణ గందరగోళంగా తయారైంది. కమిషన్‌కు అనుకూల, వ్యతిరేక నినాదాలతో సమావేశం దద్దరిల్లింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన చైర్మన్ మంజునాథ్ అర్ధాంతరంగా సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.

10/25/2016 - 02:43

విజయవాడ, అక్టోబర్ 24: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తపర్చారు. ప్రతివారం సమీక్షిస్తున్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థల వైఫల్యం వల్లే స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్‌హౌస్ తవ్వకం పనులు ఆలస్యమయ్యాయని, ఇకపై పనులు మందకొడిగా సాగితే సహించేది లేదని హెచ్చరించారు.

10/25/2016 - 02:41

విశాఖపట్నం, అక్టోబర్ 24: కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎపికి తీరని అన్నాయం చేసిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని మండలి విపక్ష నేత సి రామచంద్రయ్య ఆరోపించారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నదీ జలాల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు వౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Pages