S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/25/2016 - 02:41

తిరుమల, అక్టోబర్ 24: తిరుమల శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలోని అదనపు పోటులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. పోటులో బూందీ తయారుచేస్తున్న ఓ గ్యాస్ స్టవ్ నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు ఎగసిపడి గోడలకు ఉన్న నెయ్యిబూజుకు అంటుకుని క్షణకాలంలో ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. సకాలంలో స్పందించిన పోటు సిబ్బంది అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్ ఇన్ ‘లైట్’ను నిలిపి వేయడంతో భారీ ప్రమాదం తప్పింది.

10/25/2016 - 02:39

కర్నూలు, అక్టోబర్ 24 : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు రూ. 10కే కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం తొలిసారిగా కర్నూలులో సోమవారం ప్రారంభమైంది. కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల మార్కెట్ యార్డులలో భోజన వసతి కల్పించడానికి రంగం సిద్ధమైంది. రైతులకు అందించే భోజనం ఖర్చులో మార్కెట్ యార్డు రూ. 15, ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ రూ. 11, రైతు రూ. 10 భరించనున్నారు.

10/25/2016 - 02:33

హైదరాబాద్, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జనసేన మూడో బహిరంగ సభను వచ్చే నెల 10 వతేదీన అనంతపురంలో నిర్వహించనుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ నిర్ణయించారని కోశాధికారి ఎం రాఘవయ్య పేర్కొన్నారు.

10/25/2016 - 02:32

రాజమహేంద్రవరం, అక్టోబర్ 24: తూర్పు గోదావరి జిల్లా మన్యంలో ఇంకా మృత్యుఘోష విన్పిస్తూనే వుంది. ఏజెన్సీ ముంపు మండలాల్లోని గిరిజనులు కాళ్ల వాపు వ్యాధితో భయం గుప్పిట బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు మండలాల్లో ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధితో పదిమంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. గత ఆగస్టు మాసంలో ఈ వ్యాధి వి ఆర్ పురం మండలం అన్నవరం గ్రామంలో వెలుగుచూసింది.

10/25/2016 - 02:31

విశాఖపట్నం, అక్టోబర్ 24: మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ (ఎంవిఐ)పై వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిఐయు) సోమవారం ఏకకాలంలో దాడులు చేసి రూ.2.5కోట్ల అక్రమాస్తులు గుర్తించింది.

10/24/2016 - 05:29

విజయవాడ, అక్టోబర్ 23: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్‌గా విధానం అమలవుతుందా లేదా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం ఈ ఏడాది నుంచి జంబ్లింగ్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామంటూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరిట ఇటీవలే జిల్లా ప్రాంతీయ ఇంటర్ బోర్డు కార్యాలయాల నుంచి ఉత్తర్వులు చేరాయి.

10/24/2016 - 05:28

కాకినాడ, అక్టోబర్ 23: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈ జిల్లాను 2018 మార్చి 31వ తేదీ నాటికి బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా ప్రకటించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలుచేస్తున్నారు. అలాగే అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నారు.

10/24/2016 - 05:27

తిరుపతి, అక్టోబర్ 23: ప్రజలను తప్పుదారి పట్టించే అసత్య ప్రచార రథసారధులు వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులని ఉప ముఖ్యమంత్రి ఎన్ చినరాజప్ప విమర్శించారు. ఆదివారం తిరుపతిలోని తారకరామా స్టేడియంలో జరిగిన మారథాన్-2016 కార్యక్రమంలో విజేతలైన వారికి బహుమతులు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

10/24/2016 - 03:53

ఆలమూరు, అక్టోబర్ 23: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో పనె్నండు అడుగుల ఎత్తు పెరిగిన బెండ మొక్క పలువురిని అబ్బురపరిచింది. సాధారణంగా నాటు బెండ మొక్క మూడు నుండి నాలుగు అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. అదే హైబ్రీడ్ రకం అయితే మరో అడుగు ఎత్తు పెరుగుతుంది.

10/24/2016 - 03:52

విశాఖపట్నం, అక్టోబర్ 23: సింహాచల దేవస్థానంలో అపచారాలు ఆనవాయితీగా జరిగిపోతున్నాయి. సింహాచలాన్ని దివ్యక్షేత్రంగా మార్చడానికి కోట్ల రూపాయలు వెచ్చించి, వాస్తు విరుద్ధంగా, వైదిక సంప్రదాయాలకు భిన్నంగా అనేక నిర్మాణాలు చేపట్టారు. స్వామి సేవల్లో కూడా అప్పుడప్పుడు దోషాలు దొర్లుతూనే ఉన్నాయి.

Pages