S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/26/2016 - 03:49

కాకినాడ, అక్టోబర్ 25: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని సీఫుడ్స్ సంస్థలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీకయ్యింది. సంస్థలోని ఓ ట్యాంకు నుండి ఈ వాయువు లీక్ కావడంతో ఆ సమయంలో సంస్థలో పనిచేస్తున్న సుమారు 25 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారికి ఊపిరి ఆడకపోవడంతో ఉక్కిరిబిక్కిరై అస్వస్థతకు లోనయ్యారు.

10/26/2016 - 03:48

విజయవాడ, అక్టోబర్ 25: కృష్ణా జలాలకు సంబంధించి ఏపి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 89పై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన తీర్పుపై రాష్ట్రానికి ఒనగూరే లాభ నష్టాలేమిటనే అంశంపై మరింత కూలంకషంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

10/26/2016 - 03:46

విజయవాడ, అక్టోబర్ 25: ప్రజలకు నేరుగా సేవలందించే ప్రభుత్వ శాఖలలో తక్షణం సేవా ప్రమాణాలు నెలకొల్పి దానికి అనుగుణంగా పనులు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ఆదాయ ఆర్జిత శాఖలుగా ఉన్న ఏడు, ఎనిమిది శాఖలలో నెల రోజుల్లో ఈ మార్పు కనిపించాలని మంగళవారం మధ్యాహ్నం సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆయా శాఖల సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు.

10/26/2016 - 03:45

రాజమహేంద్రవరం, అక్టోబర్ 25: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రోడ్డుకం రైలు వంతెనలో భాగంగా ఉన్న రైలు పట్టాలపై మంగళవారం తెల్లవారుజామున ఖాళీ ఇసుక లారీ బోల్తాపడింది. ఈసంఘటనతో మంగళవారం మధ్యాహ్నం వరకు హౌరా-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

10/26/2016 - 03:43

విశాఖపట్నం, అక్టోబర్ 25: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై అడుగుల ముందుకు వేసేందుకు ప్రభుత్వం మార్గాన్ని సుగమమం చేసుకుంటోందా? బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న మావోయిస్ట్‌లను పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందా? మావోయిస్ట్‌లతోపాటు మిలిషియా సభ్యులను కూడా పోలీసులు తొక్కిపెట్టేయాలని చూస్తున్నారా?

10/26/2016 - 03:42

విశాఖపట్నం, అక్టోబర్ 25: మావోయిజమా? మరణ మృదంగమా అన్న శీర్షికతో విశాఖపట్నం మన్యం గిరిజన సమాఖ్య రూపొందించిన ఫ్లెక్సీలు విశాఖ నగరంలో మంగళవారం ప్రధాన కూడళ్ల వద్ద కనిపించాయి. మావోయిస్ట్‌ల చర్యలను వ్యతిరేకిస్తూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు నగరంలో చర్చనీయాశంమయ్యాయి. మావోయిస్ట్‌లు హతమార్చిన పాంగి రామయ్య, పాంగి శివయ్య ఉదంతాలను పేర్కొంటూ, ఎన్నాళ్లీ ఘాతుకాలకు పాల్పడతారంటూ సమాఖ్య ప్రశ్నించినట్టుంది.

10/26/2016 - 03:41

విశాఖపట్నం, అక్టోబర్ 25: వారంతా ఒకటే కుటుంబం, తండ్రిదీ ఉద్యమ నేపథ్యమే. అయితే జనజీవన స్రవంతిలో కలిసిన లక్ష్మణరావుకు ముగ్గురు సంతానం, అరుణ, ఝాన్సీ, ఆజాద్ వీరంతా విజయవాడకు చెందిన వారే. అయితే కాల క్రమంలో లక్ష్మణరావు ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అయితే వారసత్వంగా అరుణ ముందుగా మావోయిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. కొంత కాలానికి ఆమె సోదరి ఝాన్సీ కూడా ప్రజా ఉద్యమాల బాట పట్టింది.

10/26/2016 - 03:40

విజయవాడ (ఇంద్రకీలాద్రి) అక్టోబర్ 25: ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవతగా ఉన్న శ్రీకనకదుర్గమ్మ గాజులే సర్వ ఆభరణాలుగా ధరించి భక్తకోటికి మంగళకరమైన దివ్య దర్శనం మిచ్చింది. రాష్ట్రంలోని మహిళలు అందరు సౌభాగ్యంతో ఉండాలని, వివాహం కాని యువతులకు వెంటనే వివాహం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా అమ్మవార్లకు ఈ ప్రత్యేక అలంకారం చేశారు.

10/26/2016 - 03:39

విజయవాడ, అక్టోబర్ 25: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థను స్థిరంగా నిలవడంలో బ్రాహ్మణులు మార్గదర్శకంగా నిలుస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు. సమాజాన్ని కాపాడేది బ్రహ్మణులేనని, వారు నీతికి, నిజాయితీకి మారుపేరని తెలిపారు.

10/26/2016 - 03:36

కణేకల్లు, అక్టోబర్ 25: అధికారంలోకి వస్తే రైతులను ఆదుకునే పార్టీ తమదని గొప్పలు చెప్పుకున్న తెలుగుదేశం తీరా అధికారంలోకి వచ్చాక అదే రైతులను నట్టేట ముంచిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.

Pages