S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/19/2016 - 03:54

రాజమహేంద్రవరం, ఆగస్టు 18: గోదావరి స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్‌లో గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాత్రి 9 గంటల వరకూ వారి కోసం గాలిస్తూనేవున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన చైతన్య (19) స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్నాడు.

08/18/2016 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్రంలో సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా- ప్యాకేజీ అంశంపై తెదేపా- కేంద్రం మధ్య ఏం జరుగుతోందో తెలియక ఏపి బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ వ్యవహారం అంతా కేవలం ఇద్దరు ముగ్గురు నేతల వ్యక్తిగత వ్యవహారంలా మారిందే తప్ప, దానికి సంబంధించి ఏం జరుగుతుందో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే వారికి సైతం తెలియడం లేదు.

08/18/2016 - 03:23

హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియన్‌కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, 5 గ్రాముల బ్రౌన్ షుగర్, రెండు ల్యాప్‌టాప్‌లు, 15 సెల్‌ఫోన్లు, ఒక ఐప్యాడ్, రూ. 33వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి వై లింబారెడ్డి తెలిపారు.

08/18/2016 - 03:22

తిరుమల, ఆగస్టు 17: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని 7వ కిమీ వద్ద మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను తమిళనాడు భక్తులకు చెందిన ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక తీవ్రంగా గాయపడి కదలలేని పరిస్థితిలో అక్కడే కుప్పకూలి పోయింది.

08/18/2016 - 03:22

హైదరాబాద్, ఆగస్టు 17: విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని, విద్యుత్ సరఫరాపై ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ అన్నారు. ఈ నెల 19వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా అమరావతిలోనే ఏపిఇఆర్‌సి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

08/18/2016 - 03:14

దేవరాపల్లి, ఆగస్టు 17: విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఏ.కొత్తపల్లిలో అనధికారిక బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం సంభవించిన పేలుడులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన కాటపల్లి బుజ్జి (16), గాలి రాంబాబు (35) అక్కడికక్కడే మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందగా విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ జుంజూరి శివ (30) మృతి చెందాడు.

,
08/18/2016 - 03:07

కర్నూలు, ఆగస్టు 17: శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునులు కొలవైన శిరి గిరులు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరం, శ్రీశైలంలో భక్తుల పుణ్యస్నానాల పరంపర కొనసాగుతోంది. రెండు పుణ్య క్షేత్రాల్లో బుధవారం 75 వేల మంది పుష్కర స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు.

08/18/2016 - 03:03

విజయవాడ (క్రైం), ఆగస్టు 17: కృష్ణా పుష్కరాల నిర్వహణను సవాల్‌గా తీసుకుని సమస్యలు అధిగమించామని రాష్ట్ర హోం, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డిజిపి నండూరి సాంబశివరావులు అన్నారు. పౌర్ణమి సందర్భంగా గురువారం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి అవకాశం ఉందని, అదేవిధంగా 21వ తేదీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా ఉందన్నారు.

08/18/2016 - 02:59

విజయవాడ, ఆగస్టు 17: కృష్ణా పుష్కరాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. విజయవాడకు సగటున కనీసం పది లక్షల మంది పైగా యాత్రికులు తరలివస్తుండటంతో దుమ్ము, ధూళి వలన, జలుబు, దగ్గు వంటి స్వల్ప రుగ్మతలు ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతున్నాయి. నీటి కాలుష్యం వల్ల వైరల్ ఫీవర్స్, ఇతర రుగ్మతలు విజృంభిస్తున్నాయి.

08/18/2016 - 02:54

చింతూరు, ఆగస్టు 17: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పేగ గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను మావోయిస్టులు మంగళవారం రాత్రి కిడ్నాప్‌చేశారు. గ్రామానికి చెందిన కంగాల ముత్తయ్య, కంగాల నాగేశ్వరరావు, కణితి రామయ్య, సోడే ముత్తయ్యను మావోయిస్టులు కిడ్నాప్‌చేశారు. వీరంతా వారివారి ఇళ్ల వద్ద ఉండగా, మావోయిస్టులు వచ్చి, కిడ్నాప్‌చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Pages