S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/17/2016 - 14:08

విజయవాడ: కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరు బాగుందని గవర్నర్‌ నరసింహన్‌ కితాబిచ్చారు. పుష్కరాలు జరుగుతున్న తీరు పట్ల అందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అపరిశుభ్రత అనేది లేకుండా విజయవాడ నగరం స్వచ్ఛంగా కనిపిస్తోందన్నారు. పున్నమిఘాట్‌లో గవర్నర్‌ దంపతులు ఈరోజు పుష్కర స్నానం ఆచరించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

08/17/2016 - 14:02

కడప: కొండాపురం మండలం కొత్తపల్లెలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ప్రారంభమైన వాగ్వాదం చివరకు ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే అనుచరులు రామసుబ్బారెడ్డి వర్గీయులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రామసుబ్బారెడ్డి అనుచరులు 10 మందికి గాయాలయ్యాయి. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.

08/17/2016 - 12:36

విజయవాడ : కృష్ణా పుష్కరాలు ఆరో రోజున బుధవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరిస్తున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పలువురు ప్రముఖులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానాలాచరించారు. దుర్గాఘాట్‌, పద్మావతి ఘాట్‌, పవిత్ర సంగమం కృష్ణవేణి ఘాట్‌, సీతానగరం ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది.

08/17/2016 - 11:35

గుంటూరు: పిడుగురాళ్ల శివారులో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న సిమెంట్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

08/17/2016 - 11:14

విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు బుధవారం పున్నమి ఘాట్‌లో పుష్కరస్నానమాచరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ చేరుకున్న గవర్నర్‌ దంపతులు పుష్కరస్నానమాచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునున్నారు.

08/17/2016 - 05:00

విజయవాడ, ఆగస్టు 16: పుష్కరాలు అంటే 12 ఏళ్లకోసారి వస్తాయి.. అటువంటి పుష్కరాల సమయంలో నదీ స్నానాలు ఆచరించడం వల్ల ఎంతో సుఖసంతోషాలతో ఉండగలమనే నమ్మకంతో స్థానికులతో పాటు రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చేవారు కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల తాకిడి కూడా రోజురోజుకు అనూహ్యంగా పెరుగుతున్నది.

08/17/2016 - 04:59

కర్నూలు, ఆగస్టు 16: భక్తుల పుష్కర స్నానాలతో కృష్ణమ్మకు కొత్తశోభ సంతరించుకుంది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు కృష్ణాజలాలు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో భక్తులు పుష్కరోత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ప్రధాన ఆలయమైన శ్రీశైలం, సంగమేశ్వరంలో పండుగ శోభ నెలకొంది. జిల్లాలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరంలో మంగళవారం 70 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు.

08/17/2016 - 04:54

విజయవాడ, ఆగస్టు 16: గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో రోజు అర్థరాత్రి రెండు, మూడు గంటల వరకూ అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి వచ్చేది. కానీ కృష్ణ పుష్కరాల్లో తక్కువ కష్టంతో, యాత్రికుల్లో అధిక సంతృప్తిని తీసుకురాగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పుష్కరాల ఐదవ రోజు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/17/2016 - 04:53

కర్నూలు అర్బన్, ఆగస్టు 16: సమాజం అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యం అని, విద్య ప్రపంచానే్న మార్చేస్తుందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీని మంత్రి ప్రారంభించారు.

08/17/2016 - 04:51

శ్రీశైలం, ఆగస్టు 16: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలానికి నీటిరాక తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం 875.10 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 163.9724 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

Pages