S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/21/2016 - 04:56

ప్రత్తిపాడు, ఆగస్టు 20: కామంతో కళ్లుమూసుకుపోయి విచక్షణ, వావీ వరుస లేకుండా ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జగపతినగరంలో అదే గ్రామానికి చెందిన యాభై సంవత్సరాల చదరం జోగేశ్వరరావు వరుసకు కుమార్తె అయ్యే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జోగేశ్వరరావు ఇంటి ఎదురుగా ఈ చిన్నారి ఇల్లు ఉంది.

08/20/2016 - 18:17

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా సాధించే విషయమై ఏదో ఒకటి చేయాలని తనకు కూడా ఉందని, అయితే ఏం చేయాలన్నది ఇపుడే చెప్పలేనని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. కర్నాటక మాజీ సిఎం కుమారస్వామితో శనివారం భేటీ అయిన సందర్భంగా పవన్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. హోదా కోసం ఎంపీలు మాత్రమే ఏదో ఒకటి చేయగలరని, కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడిల్సిందేనన్నారు.

08/20/2016 - 17:21

హైదరాబాద్: ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ చందర్ శనివారం ప్రకటించారు. కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ భూమిని ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్కు సమీపంలోని కరకపట్లలో ఈ భూమి ఉందన్నారు.

08/20/2016 - 17:09

విశాఖ: విశాఖ బీచ్‌ రోడ్‌లో కోస్టల్‌ బ్యాటరీ కారిడార్- కైలాసగిరి మధ్య నిమజ్జనాలు నిషేధిస్తున్నట్లు గణేష్‌ నిమజ్జనాలపై ఆంక్షలు విధించినట్లు విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సీపీ యోగానంద్ తెలిపారు. రేపటి నుంచి గణేష్ మండపాలకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌ 12నుంచి 16వరకు బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో బీచ్‌ రోడ్‌లో నిమజ్జనాలు నిషేధిస్తున్నట్లు తెలిపారు.

08/20/2016 - 16:27

విజయవాడ: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు రూ.3 కోట్లు, గ్రూప్-1 ఉద్యోగంతో పాటు అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వాలని, సింధు కోచ్ గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదు, ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌కు రూ.50లక్షలు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి అధ్యక్షత శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.

08/20/2016 - 14:29

విజయవాడ: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పివి సింధుకు 3 కోట్ల రూపాయలు, ఆమె కోచ్ గోపీచంద్‌కు 50 లక్షల రూపాయల నగదు నజరానా ఇవ్వాలని ఎపి మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినట్టు తెలిసింది. నవ్యాంధ్ర రాజధానిలో సింధుకు వెయ్యి గజాల ఇంటి స్థలం, బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు గోపీచంద్‌కు స్థలం ఇవ్వాలని కూడా సిఎం చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం.

08/20/2016 - 13:54

తిరుపతి: తిరుపతి స్విమ్స్‌లో ఈసీజీ కోసం వెళ్లిన మహిళా రోగిపై టెక్నిషియన్‌ అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుడి నుంచి తప్పించుకొని ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. టెక్నిషియన్‌ మునికుమార్‌ను విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించిన ట్లు అధికారులు తెలిపారు.

08/20/2016 - 13:50

విజయవాడ: సెప్టెంబర్ 6 నుంచి హైదరాబాద్‌లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ శనివారం నిర్ణయించింది. సీఎం అధ్యక్షత జరుగుతున్న కేబినెట్‌లో పలు అంశాలపై చర్చించారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. కృష్ణాపుష్కరాల ముగింపు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశంపై కేబినెట్ చర్చ జరుగుతోంది.

08/20/2016 - 11:57

విజయవాడ: నదులను పూజించడం, గౌరవించడం భారతీయ సంప్రదాయమని, పవిత్ర భావనకు పుష్కరాలు నిదర్శనమని ఎపి టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఆయన శనివారం ఉదయం ఇక్కడి పున్నమిఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా ఉన్నాయని అన్నారు. పవిత్ర భావాన్ని పెంపొందించేందుకు ఇది మంచి అవకాశమని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు.

08/20/2016 - 11:57

విజయవాడ: కృష్ణా పుష్కరాలు ముగింపుదశకు వచ్చినందున చివరి మూడు రోజుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద కార్యకర్తలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటి వరకూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పుష్కరాలను నిర్వహించినందుకు ఆయన అధికారులను అభినందించారు.

Pages