S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/20/2016 - 11:56

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. పరిశ్రమలకు భూముల కేటాయింపు, కేంద్ర ప్రభుత్వ సాయం, పుష్కరాల ముగింపు ఉత్సవాలు, ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పివి సింధుకు అభినందన, ప్రభుత్వ తరఫున నజరానా తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.

08/20/2016 - 08:03

విశాఖపట్నం, ఆగస్టు 19: వైద్య పరికరాల తయారీలో మోడల్ జోన్‌గా ఎపి మెడ్‌టెక్ జోన్(ఎఎంటిజడ్)ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఉత్తమ నాణ్యత కలిగిన వైద్య పరికరాల తయారీ లక్ష్యంగా ఈ జోన్‌ను ఏర్పాటు చేశామన్నారు. 8 నెలల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేసి శంకుస్థాపన చేశామన్నారు. విశాఖ పెదగంట్యాడ మండలం నడపూరులో ఎఎంటిజడ్ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు.

08/20/2016 - 07:40

కర్నూలు, ఆగస్టు 19: కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటుండడం, శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో పుణ్య స్నానాలకు భక్తులు పోటీ పడ్డారు. పుష్కరాలకు కేవలం నాలుగు రోజులే ఉండటంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరంలో భారీ సంఖ్యలో పుష్కర స్నానాలాచరించారు. శుక్రవారం సుమారు 90 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని అధికారులు ప్రకటించారు.

08/20/2016 - 07:36

విజయవాడ, ఆగస్టు 19: విద్యార్థినీ విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికితీయడం, ప్రభుత్వపరమైన విధి విధానాల్లో సాంకేతికపరమైన విధానాలు అమలు చేయగలిగితే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

08/20/2016 - 07:35

విశాఖపట్నం, ఆగస్టు 19: కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీతో సిఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విశాఖలో బుధవారం ప్రారంభమైన రహదారి భద్రతపై జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన గడ్కరీని చంద్రబాబు కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 6 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

08/20/2016 - 07:34

విజయవాడ, ఆగస్టు 19: రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయంలో జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. గోదావరి పుష్కరాల తరువాత రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్చుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పుష్కరాలు కొనసాగుతున్న సమయంలోనే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి పేరు మార్పును రాష్ట్ర ప్రజలు ఆమోదించారు.

08/20/2016 - 06:21

హైదరాబాద్, ఆగస్టు 19: సింధును చూసి తల్లిదండ్రులుగా తాము, బిడ్డగా భరతమాత గర్విస్తోందని ఆమె తండ్రి రమణ అన్నారు. సింధు రజత పతకం గెలుచుకోవడంపట్ల హైదరాబాద్‌లో ఆమె తండ్రి రమణ స్పందిస్తూ సింధు విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తొలి సెట్‌లో సింధు అద్భుతంగా ఆడినప్పటికీ రెండో సెట్, మూడో సెట్లలో అవకాశాలను పాయింట్లుగా మలచుకోవడంలో వెనుకబడిందని రమణ విశే్లషించారు.

08/20/2016 - 06:21

పెదవేగి, ఆగస్టు 19: రియోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పివి సింధు బంగారు పతకం సాధించాలని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసియున్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి.

08/20/2016 - 06:07

శ్రీశైలం, ఆగస్టు 19: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వ తపాలాశాఖ పవిత్రమైన శ్రీశైలం ఆలయ చిత్రాన్ని పోస్టల్ కవర్‌పై ప్రత్యేకంగా ముద్రించింది. ఈ ముద్రణ కవర్లను శుక్రవారం తపాలా కార్యాలయంలో అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్‌మోహన్, ఎస్పీ రవికృష్ణ, శ్రీశైలం దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్త, కర్నూలు పోస్టుమాస్టర్ సంజీవ్‌రంజన్, సూపరింటెండెంట్ సుబ్బారావు పాల్గొన్నారు.

08/20/2016 - 06:05

తిరుపతి, ఆగస్టు 19: టిటిడి తయారుచేయించిన స్వామి, అమ్మవార్ల చిత్రాలు కలిగిన రాగి డాలర్లకు పుష్కరాల్లో అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. తిరుమలలో టిటిడి బంగారు, వెండి డాలర్లను విక్రయిస్తున్న విషయం పాఠకులకు విదితమే.

Pages