S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/10/2016 - 07:45

న్యూఢిల్లీ, జూలై 9: తనకు కనీసం ఒక ఇల్లుకూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను సిపిఐ నేత నారాయణ ఎద్దేవాచేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ సర్వేపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ సమగ్ర సర్వే పేరుతో హడావుడి చేసినట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ సర్వే పేరుతో హడావుడి మొదలెట్టారని ఆయన విరుచుకుపడ్డారు. ఇంలాటి సర్వేలతో ఒరిగేదేంటని ప్రశ్నించారు.

07/10/2016 - 07:43

చిత్తూరు, జూలై 9: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వసతి కోసం 8వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్ర తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా పరిషత్ పాలక వర్గ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13వేల పంచాయతీల్లో తాగునీరు నివారణ కోసం 850కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు.

07/10/2016 - 07:42

కలికిరి, జూలై 9: చిత్తూరు జిల్లా కలికిరి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

07/10/2016 - 07:42

కడప, జూలై 9: చిత్తూరు జిల్లా చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని శనివారం సాయంత్రం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చెవిరెడ్డిని కడప సెంట్రల్ జైల్ అధికారులకు అప్పగించారు. శుక్రవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి చెవిరెడ్డి చేరుకుని ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించారని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.

07/10/2016 - 07:41

విజయవాడ, జూలై 9: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్ఛలవిడి అవినీతిపై నిరంతర పోరాటం చేపట్టాలని రాజధాని నిర్మాణం కోసం చేసుకున్న స్విస్ ఛాలెంజ్ చీకటి ఒప్పందాలను రద్దు చేసి కేంద్రం నిధులతో స్వదేశీ కంపెనీలతో రాజధాని నిర్మాణం చేపట్టాలని పోలవరం మిగులు జలాలను రాయలసీమకు కేటాయించాలని శనివారం నాడిక్కడ జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం డిమాండ్ చేసింది.

07/10/2016 - 04:40

విశాఖపట్నం, జూలై 9: నవ్యాంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి ప్రాధాన్యతినిస్తూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ, విదేశాల నుంచి విశేషంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు రకాలైన ప్రాజెక్టులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనుంది.

07/09/2016 - 18:19

కడప : లక్కిరెడ్డిపల్లెలో పోలీస్ స్టేషన్‌లో విద్యార్థి జగన్నాథనాయుడు శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జగన్నాథనాయుడు, అతని స్నేహితుల మధ్య శుక్రవారం గొడవైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని జగన్నాథనాయుడుని ప్రత్యర్థి వర్గానికి చెందిన విద్యార్థులు బెదిరించారు. కేసు లేకుండా ఉండాలంటే రూ. 30 వేలతో రాజీ కుదుర్చుకోవాలన్నారు.

07/09/2016 - 18:11

విజయవాడ: జీవో నెం.97 రద్దు చేసి, బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో బందరు పోర్టుకు 5000 ఎకరాలు కేటాయిస్తే, 1200 ఎకరాలు చాలని అప్పట్లో టీడీపీ నిరసన తెలిపిందని, ఇప్పడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్ష ఎకరాలు కేటాయించారని ఆరోపించారు.

07/09/2016 - 18:06

విశాఖ: పడమటి వైపు నుంచి వీస్తున్న గాలులు వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఏపీ, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుండి కొస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. తీరం వెంట గంటకు 40-45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

07/09/2016 - 18:00

చిత్తూరు: కలికిరి జేఎన్‌టీయూ కళాశాల ఎదురుగా శనివారం ఆటోను సుమో ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. మృతులు మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం వాసులుగా గుర్తించారు.

Pages