S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/11/2016 - 06:41

కడప, జూలై 10 : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కర్నూలు జిల్లాకు చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు మస్తాన్‌వలి, అతడి కుటుంబ సభ్యులు, ప్రియురాలు నీతూఅగర్వాల్ కుటుంబ సభ్యులను కడప జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ నేతృత్వంలో జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

07/11/2016 - 06:39

హైదరాబాద్, జూలై 10: ఆర్టీసిని పరిరక్షించేందుకు కార్మిక సంఘాలు యాజమాన్యానికి పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఈ విషయమై తమ సలహాలను స్వీకరించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసి ఎంప్లారుూస్‌యూనియన్ ఉపప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

07/11/2016 - 06:38

విజయవాడ, జూలై 10: ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇఎల్ నరసింహన్‌పై గతంలో ఆయన నియామకానికే కారణభూతమైన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమవుతున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

07/11/2016 - 06:37

విశాఖపట్నం, జూలై 10: పుష్కర పనుల్లో భాగంగా విజయవాడలో కూల్చివేస్తున్న దేవాలయాలను తక్షణమే ఆగమ శాస్తబ్రద్ధంగా పునర్నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ ఉత్తర విభాగం (ఆంధ్రప్రదేశ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకటేశ్వరరావు ఆదివారం విశాఖలో విలేఖర్లతో మాట్లాడారు. పుష్కరాల ప్రారంభంలోగా దేవాలయాలను యథావిధిగా నిర్మించాలన్నారు.

07/11/2016 - 06:36

విజయవాడ, జూలై 10: రాష్ట్రంలో పాలన కుంటి నడక నడుస్తోంది. రాము..రామంటూనే ఉద్యోగుల్లో కొంతమంది అమరావతికి చేరుకున్నారు. ఛలో అమరావతి అంటూ ఫైళ్లన్నీ మూట కట్టి తీసుకొచ్చారు. తీరా వచ్చాక కార్యాలయాలు, కనీస సదుపాయాలు లేకపోవడంతో చాలామంది తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ నుంచి సాగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలిగింది.

07/11/2016 - 05:58

విజయవాడ, జూలై 10: రాజధాని అమరావతి నిర్మాణానికి కజకిస్థాన్ దేశం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆస్తానా, ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర కార్యాచరణ బృందం ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ప్రపంచ నగరాల్లో నిర్మాణ శైలిలో అద్భుతమైనదని ప్రశంసలు పొందిన కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఆదివారం విస్తృతంగా పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన నగర మేయర్ అస్సెట్ లెస్క్‌షొవ్‌తో భేటీ అయ్యారు.

07/11/2016 - 05:56

గుంటూరు, జూలై 10: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి రెండోవిడత కొన్ని కీలకమైన శాఖలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత నెల 29న 5వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పంచాయతీరాజ్, హౌసింగ్ విభాగాలు ఏర్పాటయ్యాయి. రెండోవిడతలో భాగం గా ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌పోర్టు, కార్మికశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రధాన కార్యాలయాలకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు రానున్నారు.

07/11/2016 - 05:42

హైదరాబాద్, జూలై 10: ఏపి డిజిపిగా ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ నండూరి సాంబశివరావు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆర్టీసి చైర్మన్‌గా డిజిపి రేసులో ఉన్న మరో ఐపిఎస్ మాలకొండయ్య నియమితులయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చాక వీరిద్దరి నియామకాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

07/11/2016 - 04:37

గోపాలపురం, జూలై 10: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంగా పేర్కొంటున్న పట్టిసం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తొందరపడి తోడేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీరు కృష్ణాకు చేరుకోవడానికి ఆధారమైన పోలవరం కుడి కాలువ పనులు ఇంకా పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

07/11/2016 - 04:36

నూజివీడు, జూలై 10: పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న గోదావరి జలాలు కృష్ణా జిల్లాలోకి సోమవారం ప్రవేశిస్తాయని, వీటిని అధికారులు సమన్వయంతో కృష్ణా నదిలోకి పంపాలని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. రామిలేరు, తమ్మిలేరుపై యుటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

Pages