S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/12/2016 - 04:11

కర్నూలు, జూలై 11: ‘మంత్రి హోదాలో తాను వస్తే పరిశుభ్రత పాటిస్తారు, చెత్త ఎత్తేస్తారు, సున్నం వేయిస్తారు, పందులను దూరంగా పంపుతారు.. ఇదంతా ప్రజలకూ తెలుసు.. నాకూ తెలుసు.. నేనొచ్చిన రోజుమాత్రమే ఇలా ఉంటే సరికాదు, నిత్యం ఇలాగే ఉండాలి, అప్పుడే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి ఇష్టపడతారు’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.

07/12/2016 - 04:09

విజయనగరం(టౌన్), జూలై 11: మంత్రి మృణాళిని ఆకస్మిక తనిఖీతో ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు హతలెత్తిపోయారు. సోమవారం ఉదయం పట్టణంలోని కస్పా మున్సిపల్ హైస్కూల్‌కు మంత్రి అకస్మాత్తుగా వచ్చినప్పుడు అప్పటికి కొద్దిమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు మాత్రమే వచ్చారు. మంత్రి విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనం పథకం తీరును తనిఖీ చేసారు.

07/12/2016 - 04:08

విజయవాడ, జూలై 11: ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది నూతన రాజధాని అమరావతికి తరలివస్తున్న నేపథ్యంలో వారికి క్వార్టర్లు నిర్మించేందుకు సిఆర్‌డిఏ అవసరమైన చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెజిటెడ్ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నపళంగా ఇక్కడికి రావాలంటే వారికి గృహ వసతి కల్పించాల్సిన అవసరం ఉంది.

07/12/2016 - 04:07

శ్రీకాకుళం, జూలై 11: నకిలీ నాణేల మూలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉన్నాయని వైకాపా నేత తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఈ వ్యవహారమంతా లింగమనేని ఎస్టేట్ కేంద్రంగా జరిగిందని ఆరోపించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ నాణేల కేసులో 20 నుంచి 30 కోట్ల రూపాయల మేరకు డీల్ జరిగిందని ఆరోపించారు. శ్రీకాకుళంలో అరెస్టు అయిన నిందితులకు ఆ స్థాయి లేదన్నారు.

,
07/12/2016 - 03:45

గుంటూరు, జూలై 11: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఫస్ట్ఫో్లర్ రెయిలింగ్ కూలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ చేపట్టిన నిర్మాణాల్లో భాగంగా సచివాలయం ఫస్ట్ఫో్లర్‌లో సోమవారం పనులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. వర్షం తాకిడికి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన నిర్మాణంలో ఉన్న పిట్టగోడ ఇటుకలు ఒక్కొక్కటిగా కూలడంతో కార్మికులు పరుగులు తీశారు.

07/12/2016 - 03:41

హైదరాబాద్, జూలై 11: విజయవాడ హిందూ దేవాలయాల కూల్చివేత జరిగి 20 రోజులవుతోంది. ఇప్పటివరకూ వాటి పునర్మిర్మాణ పనులపై, ప్రభుత్వం నడుం బిగించకపోవడంతో హిందూ సంస్థలు, భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. విజయవాడలో 45 దేవాలయాలను రోడ్ల విస్తరణ, ఘాట్ల అభివృద్ధి పేరుతో వివాదాస్పదంగా కూల్చివేసిన ఘటనలో బీజేపీ, హిందూ సంస్థలు, ప్రభుత్వానికి మధ్య అంతరం ఏర్పడిన సంగతి తెలిసిందే.

07/12/2016 - 03:46

హైదరాబాద్, జూలై 11: ఏపి ప్రభుత్వ మీడియా (కమ్యూనికేషన్) సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రాధాన్యం పెరిగింది. ఆయనకు మళ్లీ రెండేళ్ల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సహజంగా ఈ పదవిని ఏడాదిపాటు మాత్రమే పొడిగించే సంప్రదాయం ఉంది. అందుకు భిన్నంగా రెండేళ్లు పొడిగించడాన్నిబట్టి, ఆయనకు తిరిగి ప్రాధాన్యం ఏర్పడిందన్న సంకేతాలు వెళ్లాయి.

07/12/2016 - 03:36

విజయవాడ, జూలై 11: బందరు పోర్టు నిర్మాణ పనులను వచ్చే ఏడాది ప్రారంభించి 2018 నాటికి ఓడ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సోమవారం బందరు పోర్టు నిర్మాణంపై మంత్రి తన విజయవాడ క్యాంప్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. పోర్టు నిర్మాణంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు.

07/12/2016 - 03:35

హైదరాబాద్, జూలై 11: గుంటూరు జిల్లాలోని సదావర్తి భూముల అమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ భూముల అమ్మకాన్ని సవాలు చేస్తూ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.

07/11/2016 - 06:41

బుక్కరాయసముద్రం, జూలై 10:ప్రేమించిందన్న కారణంతో కన్నకూతురి చేత తండ్రి బలవంతంగా పురుగుల మందు తాగించిన సంఘటన శనివారం రాత్రి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో చోటుచేసుకుంది. శింగనమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కూతురు సి జ్యోతి అనంతపురంలోని హాస్టల్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది.

Pages