S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/11/2016 - 01:34

రాజమహేంద్రవరం, జూలై 10: ఆది పుష్కరాల పనులకే ఠికాణా లేదు.. ఇక అంత్య పుష్కరాల పనుల మాటేమిటన్నట్టుగా తయారైంది నగరంలో పుష్కర అభివృద్ధి పనుల పరిస్థితి. గోదావరి మహా పుష్కరాలకు కేటాయించిన రూ.240 కోట్ల నిధులకు సంబంధించి కేవలం రూ.120 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన నిధులకు అతీగతీ లేదు. ఆది పుష్కరాల్లో మొదలై అంత్య పుష్కరాల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

07/11/2016 - 01:33

విజయవాడ, జూలై 10: ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్టవ్య్రాప్తంగా పలు గురుకుల భవనాల నిర్మాణానికై వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. గురుకుల విద్యా విధానంలో సమూల మార్పుల కోసం వచ్చే మూడేళ్లలో దశలవారీగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లన్నింటినీ గురుకుల విద్యాలయాలుగా మార్పు చేయనున్నట్లు తెలిపారు.

07/11/2016 - 01:32

హైదరాబాద్, జూలై 10: తెలుగుదేశం ప్రభుత్వానికి రైతుల వ్యతిరేకత తప్పడం లేదు. అమరావతి నిర్మాణానికి 32 వేల ఎకరాలు ఇచ్చినప్పటికీ, భూమి ఇచ్చిన రైతులకు ఎక్కడ భూములిస్తారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వని ప్రభుత్వం దృష్టి, ఇప్పుడు బందరు మీద పడింది. పోర్టు నిర్మాణంతోపాటు, పారిశ్రామిక అవసరాల కోసమంటూ 36 వేల ఎకరాలు సమీకరించేందుకు నేడు నోటిఫికేషన్ ఇవ్వనుంది.

07/11/2016 - 01:31

కర్నూలు, జూలై 10: కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాట్లు చేస్తోంది. అయితే కృష్ణా పుష్కర స్నానాలకు మాత్రం ఇతర నదీ జలాలను తరలించి ‘మమ’ అనిపించేలా ఉందని, పరిస్థితులను పరిశీలిస్తే అనుమానాలు వస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

07/11/2016 - 01:30

ఒంగోలు, జూలై 10: రాష్ట్రంలో మూడు వేల ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వెల్లడించారు. ఆదివారం ఒంగోలులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ దళితుల భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని వాటిని స్వాధీనం చేసుకునేందుకు అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు.

07/11/2016 - 01:28

విశాఖపట్నం, జూలై 10: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు లైఫ్ సేవింగ్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ నగరం హోటల్ నొవెటల్‌లో ఆదివారం రెండో ఒబిస్టిట్రిక్స్ అండ్ గైనకాలజికల్ రాష్ట్ర సదస్సును ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే విశాఖ సమీపానున్న మధురవాడలో సోలార్ వేడినీటి ప్లాంట్‌ను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు.

07/11/2016 - 01:12

తిరుమల, జూలై 10: తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులకు వారాంతపు సెలవులు తోడుకావడంతో శని, ఆదివారాల్లో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం మేరకు ఉచిత క్యూలైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకునే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

07/11/2016 - 01:08

హైదరాబాద్, జూలై 10: వచ్చే నెల 15వ తేదీ నాటికి ఏడు ప్రభుత్వ శాఖలను పూర్తి స్థాయిలో విజయవాడకు మార్చేందుకు ఏపి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఇంతవరకు చాలా శాఖలను మార్చినా ఇంకా ఉద్యోగులు పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లలేదు.

07/10/2016 - 16:32

హైదరాబాద్:కారులో వెడుతూండగా అతివేగంగా వచ్చి అదుపుతప్పిన మరోవాహనం మీదపడిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన పదేళ్ల చిన్నారి రమ్య మృతిచెందింది. పాఠశాలలో చేరిన తొలిరోజు ఇంటికి వస్తూండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వారంరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. కాగా ఈ సంఘటనలో ఆమెతల్లి, మామయ్యకూడా తీవ్రంగా గాయపడ్డారు.

07/10/2016 - 16:30

శ్రీనగర్:హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వాని ఎన్‌కౌంటర్‌తో కాశ్మీర్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. రెండురోజులుగా జరిగిన సంఘటనల్లో 17మంది మరణించారు. 200మంది గాయపడ్డారు. ఆదివారం ఓ పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి ఆందోళనకారులు తోసివేశారు. ఈ సంఘటనలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. తాజా పరిస్థితులపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు.

Pages