S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/19/2016 - 06:48

తూళ్లూరు, మే 18: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం లో అద్దెలు భరించలేం.. విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో ఉండే మహిళా ఉద్యోగులకు భద్రత ఎలా ఉంటుందో..? జూన్ 27న తొలివిడతగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. 13వ తేదీనే పిల్లలకు పాఠశాలలు పునప్రారంభమవుతాయి.. వసతులు లేక ఈ ఏడాదికి హైదరాబాద్‌లోనే ఉండాలంటే తమ పరిస్థితి ఏమిటని సచివాలయ మహిళా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

05/19/2016 - 06:37

రాజమండ్రి, మే 18: ప్రత్యేక హోదాతోనే సమస్యలకు పరిష్కారం లభించదని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సాధించడానికి కేంద్రం చేయూతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్ర లోటు బడ్జెట్‌ను పూడ్చాలని కోరానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే జాతికే లాభమని ప్రధానికి వివరించానన్నారు.

05/19/2016 - 06:38

తిరుపతి, మే 18: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుమలలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, రంగనాయకుల మండపం ముందు భాగాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అప్రమత్తమైన ఇవో సాంబశివరావు యంత్రాలద్వారా నీటిని తోడించారు. ఈ సమయంలో భక్తులను మహాద్వారం వద్ద నిలిపివేశారు.

05/19/2016 - 06:38

తిరుపతి/నెల్లూరు/ఒంగోలు, మే 18: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా చిత్తూరుతో పాటు కోస్తా జిల్లాలయిన నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బుధవారం ఉదయంనుంచి ఇటు గుంటూరు మొదలుకొని అటు శ్రీకాకుళం జిల్లా దాకా కూడా పలు చోట్ల ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

05/18/2016 - 18:01

హైదరాబాద్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు పోరాడే ముఖ్యమంత్రి కావాలని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ఇక్కడ బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ, తాజాగా దిల్లీ వెళ్లిన సిఎం చంద్రబాబు అక్కడ గొప్పలు చెప్పుకున్నారే తప్ప రాష్ట్రం కోసం ఏమీ అడగలేదన్నారు. ప్రధాని మోదీని బాబు కలిసినపుడు- తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదన్నారు.

05/18/2016 - 18:00

విశాఖ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా, భారీగా నిధులను విడుదల చేస్తున్నామని రాష్ట్ర బిజెపి ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ బుధవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఎపికి అదనంగా 22,112 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించిందని, ఇప్పటికే 7వేల కోట్లు విడుదల చేశామన్నారు.

05/18/2016 - 16:50

హైదరాబాద్: కొందరు వైకాపా నేతలు తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కాంట్రాక్టులు తీసుకుని ఎపిలో జలదీక్షలు చేస్తున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బుధవారం ఆరోపించారు. వైకాపాను వీడిన తర్వాత ఆయన తొలిసారిగా జగన్‌పై విమర్శలు సంధించారు. ఎపి ప్రయోజనాలు జగన్‌కు పట్టవా? దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

05/18/2016 - 16:49

విజయవాడ: హైదరాబాద్ శివారులో కారు ప్రమాదంలో మరణించిన ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్యవాణి భౌతికకాయానికి రుద్రపాక గ్రామంలో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. ఎపి సిఎం చంద్రబాబు పిన్నమనేనిని పరామర్శించారు. అంత్యక్రియలకు పలువురు మంత్రులు, టిడిపి కార్యకర్తలు, సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

05/18/2016 - 16:24

గుంటూరు: హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని వదులుకుని ఎపి తాత్కాలిక రాజధాని వెలగపూడికి రావడం ఇబ్బందే అయినా, అది తప్పదని ఎపి సచివాలయానికి చెందిన ఉద్యోగినులు అన్నారు. హైదరాబాద్ నుంచి మూడు బస్సుల్లో బుధవారం వారు వెలగపూడికి వచ్చి తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి చెందారు. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. కొన్ని సమస్యలున్నా తామంతా ఇక్కడికి వస్తామని స్పష్టం చేశారు.

05/18/2016 - 16:23

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చి దిశను మార్చుకుని ఒడిశా వైపు కదులుతోంది. ఫలితంగా కోస్తాంధ్ర ప్రాంతంలో రాబోయే 24 గంటల్లో తుపాను ఏర్పడే ప్రమాదం ఉందని ఇక్కడి వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపానుగా మారితే తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వానలు కురిసే అవకాశం ఉంది.

Pages