S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/20/2016 - 17:58

విజయవాడ: కృష్ణానది పుష్కరాల కోసం చేపట్టిన పనులను ఎపి డిజిపి జెవి రాముడు, కలెక్టర్ బాబు, నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం పరిశీలించారు. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిజిపి అన్నారు. జూలై నెలాఖరుకు పనులన్నీ పూర్తి కావాలని సంబంధిత కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.

05/20/2016 - 17:57

కర్నూలు: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ఆత్మకూరులో బెట్టింగ్‌లు నడుపుతున్న ముఠాపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు యువకులను అరెస్టు చేసి, నాలుగు సెల్‌ఫోన్లు, 70 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

05/20/2016 - 14:58

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రోను’ తుపాను ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. దీంతో కోస్తాంధ్ర జిల్లాలకు ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో తుపాను స్థిరంగా కదులుతోంది. ఇది ఈరోజు రాత్రికి ఒడిశా తీరంలో బలమైన తుపానుగా మారే అవకాశం ఉంది.

05/20/2016 - 14:56

విజయనగరం: ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగా మరోవైపు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా రామభద్రపురం హరిజన వీధిలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

05/20/2016 - 14:55

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా సాధించేవరకూ తాము వివిధ స్థాయిల్లో పోరాటం చేస్తామని ఎపి పిసిసి అధినేత రఘువీరారెడ్డి ప్రకటించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు విప్పడం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసు భయంలో కెసిఆర్ అంటే బాబుకు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు.

05/20/2016 - 14:55

శ్రీకాకుళం: మండువేసవిలో భారీ వర్షాలు రైతులకు ఉపశమనం కలిగించగా, మరోవైపు చేపల వర్షం కురియడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం రైతులు పొలాలకు వెళ్లి చూడగా ఎక్కడపడితే అక్కడ చేపలు కనిపించాయి. వర్షంతో పాటు చేపలు కూడా ఆకాశం నుంచి పడడంతో వాటిని పట్టుకునేందుకు రైతులు పోటీపడ్డారు.

05/20/2016 - 13:56

హైదరాబాద్: విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు లొంగిపోయారు. వారం రోజుల్లోగా విచారణకు హాజరుకాకుంటే అరెస్టు చేస్తామని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆయన స్వయంగా లొంగిపోయారు. కార్పొరేటర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

05/20/2016 - 12:05

విశాఖ: బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. విశాఖ నగరంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ప్రారంభించారు.

05/20/2016 - 12:04

చిత్తూరు: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యం అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్ర చందనం దుంగలతో పాటు ఆరుకార్లను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

05/20/2016 - 06:42

విజయవాడ, మే 19: రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారి నుంచి అతి చిన్న ఉద్యోగి వరకు తమ పదవీ కాలంలో కోట్లాది రూపాయలను అక్రమంగా ఏ విధంగా కూడబెడుతున్నారో కృష్ణాలో ఇటీవలికాలంలో పరంపరగా కొనసాగుతున్న ఎసిబి అధికారుల దాడుల్లో వెలుగుచూస్తున్న వైనాలు నిరూపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం పదవీ విరమణ చేయబోతున్న ఒక గ్రామ రెవెన్యూ అధికారి విలువైన అక్రమ ఆస్తులతో గురువారం పట్టుబడ్డారు.

Pages