S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/21/2016 - 12:45

గుంటూరు: రాష్ట్రంలో నాలుగు ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులను త్వరలో ఇస్తామని వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇక్కడి లాం ఫాంలో శనివారం జరిగిన ఎపి వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలి పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకవర్గ సభ్యులుగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, జవహర్, జనార్దన్‌రెడ్డి, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

05/21/2016 - 12:14

విజయవాడ: ఎపి ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్‌లో కర్నూలుకు చెందిన హేమలత ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకోగా, టాప్ టెన్ ర్యాంకర్లలో తెలంగాణకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలు:
-------------------------------------------------------
పేరు ర్యాంకు మార్కులు
------------------------------------------------------

05/21/2016 - 12:09

విజయవాడ: ఎపి ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను శనివారం ఇక్కడ సిఎం చంద్రబాబు విడుదల చేశారు. తొలి పదిర్యాంకుల వివరాలను ఆయన ప్రకటించారు. ఇటీవల ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను ప్రకటించినప్పటికీ, ‘నీట్’పై సుప్రీం కోర్టు తీర్పు అప్పటికి రానందున మెడికల్ ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ‘నీట్’ను ఈ ఏడాదికి మినహాయిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యలో ఈరోజు మెడికల్ ఫలితాలను విడుదల చేశారు.

05/21/2016 - 12:08

విశాఖ: అనకాపల్లి సమీపంలోని సిరసపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని ఏలూరు నుంచి విశాఖ వెళుతున్న కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురిని విశాఖ ఆరిలోవకు చెందినవారిగా గుర్తించారు. మరో మృతుడిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

05/21/2016 - 12:07

కర్నూలు: నంద్యాల పట్టణంలోని ఏకలవ్యనగర్‌లో వెంకటేశ్వర్లు అనే డ్రైవర్ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగు చూసింది. ఓ మహిళతో అక్రమ సంబంధం వల్లే ఈ దారుణం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

05/21/2016 - 03:58

విశాఖపట్నం, మే 20: బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తుపాను క్రమంగా బలహీన పడుతోంది. దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో పారాదీప్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం రోను తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా కదులుతూ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. అన్ని పోర్టుల్లోను రెండవ నెంబర్ ప్రమాద సూచికలను జారీ చేశారు.

05/21/2016 - 03:50

విజయవాడ, మే 20: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ ప్లాట్ల కేటాయింపుపై మరో అవకాశం ఇచ్చింది. భూ సమీకరణ పథకం 9,18ఎ, 9, 18బి కింద ప్లాట్ల కేటాయింపునకు ఆప్షన్ కోరే గడువును ఈ నెల 25 వరకు పెంచుతూ సిఆర్‌డిఎ సమావేశం నిర్ణయం తీసుకుంది.

05/21/2016 - 03:42

కాకినాడ, మే 20: మెడిసిన్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఎట్టకేలకు నీట్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాదికి మినహాయింపు లభించడంతో మెడిసిన్, అగ్రికల్చర్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎపి ఎంసెట్-2016 ఫలితాలను ఈనెల 9వ తేదీన విడుదల చేయాల్సి ఉంది.

05/20/2016 - 17:59

విజయవాడ: వేతన సవరణ సందర్భంగా చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఎపి ఉద్యోగ సంఘాల జెఎసి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. జెఎసి అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం ఇక్కడ సిఎంను కలిసి 11 ప్రధాన డిమాండ్లపై చర్చించారు. పిఆర్‌సి ప్రకారం కనీస వేతనంగా 13 వేల రూపాయలు చెల్లించాలని, జూలై 15లోగా బదిలీలను పూర్తి చేయాలని వారు సిఎంను కోరారు.

05/20/2016 - 17:58

విజయవాడ: ఎంసెట్‌లో మెడికల్ విభాగానికి సంబంధించి ఫలితాలను శనివారం విడుదల చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ‘నీట్’ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్‌ను జారీ చేయడంతో మెడికల్ ఎంట్రన్స్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.

Pages