S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/18/2016 - 13:48

కాకినాడ: నగరంలోని రామకృష్ణారావుపేటలో బుధవారం ఉదయం ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి తల్లి,కూతురు మృత్యువాత పడ్డారు.

05/18/2016 - 12:17

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌-2016లో 96.53 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం అనంతపురం జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన ఈసెట్‌ పరీక్షకు 34,739 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 33,535 మంది ఉత్తీర్ణత సాధించారు.

05/18/2016 - 12:12

విజయవాడ: జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి డి.నాగేశ్వరరావును అతని స్వగ్రామంలో దుండగులు హత్య చేశారు. తిరువూరు మండలం అక్కపాలెంలో బుధవారం తెల్లవారు జామున రక్షిత నీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు నుంచి నీటిని విడుదల చేసేందుకు వెళ్లిన ఆయనను పథకం ప్రకారం హత్య చేశారు. నీటిగుంటలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు నాగేశ్వరరావు భార్య వెంకటరమణ అక్కపాలెం సర్పంచ్‌గా ఉన్నారు.

05/18/2016 - 12:12

కర్నూలు: తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైకాపా అధినేత జగన్ ఇక్కడ చేపట్టిన జలదీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఆయనను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

05/18/2016 - 12:12

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భార్య సాహిత్యవాణిని కోల్పోయిన ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావును బుధవారం ఉదయం రుద్రపాకలో ఎపి సిఎం చంద్రబాబు పరామర్శించారు. సాహిత్యవాణి మృతదేహం వద్ద ఆయన నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు యనమల, దేవినేని, పుల్లారావు, రవీంద్ర, కామినేని శ్రీనివాస్ తదితరులు పిన్నమనేనిని పరామర్శించారు. సాహిత్యవాణి మరణంతో రుద్రపాకలో విషాదఛాయలు అలముకున్నాయి.

05/18/2016 - 12:11

విజయవాడ: అదనపుకట్నం తెమ్మని వేధిస్తున్న అత్తమామలు కోడలిపై కిరోసిన్ చల్లి నిప్పంటించిన ఘటన ముసునూరు మండలం చెక్కపల్లిలో బుధవారం జరిగింది. తీవ్రంగా గాయపడిన కోడలిని ఆస్పత్రికి తరలించారు. తనపై అత్తమామలే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

05/18/2016 - 07:31

హైదరాబాద్, మే 17: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కెజిబివికి చెందిన బధిర విద్యార్థిని నాగలక్ష్మి పదో తరగతిలో జిపిఎ 10కి 10 సాధించిన నేపథ్యంలో ఆమె ఉన్నత చదువులకు రాష్ట్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఆయన నాగలక్ష్మిని ఘనంగా సత్కరించారు.

05/18/2016 - 07:30

విశాఖపట్నం(క్రైం), మే 17: ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుపై సద్గురు రమణానంద మహర్షి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అతని శిష్యుడు పిఎస్ నారాయణ ఫిర్యాదు మేరకు ఇక్కడి నాలుగో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదు వివరాలివి. ఈనెల ఐదో తేదీ రాత్రి 9గంటల సమయంలో ఓ భక్తి ఛానల్‌లో నగరానికి చెందిన సద్గురు రమణానందమహర్షి ఆధ్యాత్మిక ప్రసంగం ఇచ్చారు.

05/18/2016 - 07:29

కాకినాడ, మే 17: తన కుమార్తె అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తామని బెదిరిస్తున్న నిందితులపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఒక ప్రజాప్రతినిధి అనుచరులకు, తనకు మధ్య గల భూవివాదాల కారణంగా తనపై ఈ విధంగా కక్ష గట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

05/18/2016 - 07:28

వేపగుంట, మే 17: అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యల సంయుక్తంగా ఈనెల 22న విజయవాడలో నిర్వహిస్తున్న ‘విప్రోత్సవం’ మహాసభకు బ్రాహ్మణులందరూ తరలిరావాలని విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విశాఖనగర పరిధి, చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు.

Pages