S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/20/2016 - 06:41

కదిరి టౌన్, మే 19: అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామ సమీపంలో అనంతపురం-చెన్నై 205 జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు.. కడప జిల్లా గుండుపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులునాయుడు కుటుంబంతో పాటు కొనే్నళ్ల క్రితం కర్ణాటకలోని బళ్లారికి మకాం మార్చారు.

05/20/2016 - 06:39

విజయవాడ, మే 19: ‘రోను’ తుపాను ప్రభావంతో వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈదురుగాలుల ఉద్ధృతికి జనజీవనం అస్తవ్యస్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

05/20/2016 - 06:38

వజ్రకరూరు, మే 19 : పిడుగు పడి వృద్ధ దంపతులు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని ఛాయాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. ఛాయాపురం గ్రామానికి చెందిన బోయ కదిరప్ప(65), లక్ష్మీదేవి(60) దంపతులు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

05/20/2016 - 06:38

విజయపురిసౌత్, మే 19: శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి విడుదల అవుతున్న నీటి సరఫరాను గురువారం పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 507.60 అడుగులకు చేరుకుంది. ఇది 127.6322 టియంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి హైదరాబాద్‌లోని జంటనగరాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 400క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

05/20/2016 - 06:37

అనంతగిరి, మే 19: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తవలస-కిరండోలు రైల్వే మార్గంలో కొండ చరియలు జారిపడి గురువారం గూడ్స్ రైలు మూడు ఇంజన్లు, ఒక వ్యాగన్ దెబ్బతిన్నాయి. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కిరండోలు-కొత్తవలస రైల్వే మార్గంలో కిముడుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 65వ నెంబర్ వద్ద భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి.

05/20/2016 - 06:37

విజయవాడ, మే 19: అగ్రిగోల్డు సంస్థలో స్వల్ప మొత్తాల్లో పెట్టుబడులు పెట్టిన, పేద, మధ్యతరగతి వర్గాలకు సత్వర న్యాయం లభించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికార్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి తన నివాసంలో గురువారం అగ్రిగోల్డు కేసు పురోగతిపై ఉన్నతాధికార్లతో సమీక్షించారు.

05/20/2016 - 06:36

విజయవాడ, మే 19: హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి తరలి వచ్చేందుకు ఉద్యోగులకు కష్టాలు స్వాగతం పలకబోతున్నాయి. ఇక్కడికి వచ్చే ఉద్యోగులు మామూలు కష్టాలు కావు., అష్టకష్టాలు అనుభవించే పరిస్థితి ఉంది. జూన్ నెలాఖరు నాటికి సుమారు మూడు వేల మంది ఉద్యోగులు అమరావతికి వస్తారని మంత్రి నారాయణ పదేపదే చెపుతున్నారు.

05/20/2016 - 06:35

హైదరాబాద్,మే 19: ‘అధికారం లేకుండా రెండేళ్లు కూడా ఉండలేరా?’
‘ఇప్పటికి రెండుపార్టీలు మార్చావు. రేపుఈ పార్టీ మారవని గ్యారంటీ ఏమిటి’?
‘ మిమ్మల్ని గెలిపించిన వేలాది మంది ఓటర్లను మోసం చేశావు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇక్కడ మేం చెప్పినట్లు వినాల్సిందే’

05/20/2016 - 04:49

హైదరాబాద్, మే 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 31 ఐఎఎస్ పోస్టులను కేంద్రం కేటాయించనుంది. ఈ నెలాఖరులోగా ఈ విషయమై కేంద్ర పర్సనల్ ట్రైనింగ్ విభాగం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు 41 మంది ఐఎఎస్ అధికారులను కేటాయిస్తూ డిఓపిటి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

05/20/2016 - 04:47

విజయవాడ, మే 19: తెలుగుదేశం.. ప్రజారాజ్యం... కాంగ్రెస్ పార్టీలలో కొనసాగి ప్రస్తుతం వైకాపా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పించుకున్నారు.

Pages