S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/17/2016 - 08:42

యానాం, మే 16: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలోని యానాం నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలో 93.01 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అగ్రహారం బూత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

05/17/2016 - 08:42

విశాఖపట్నం, మే 16: ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎపిఐసెట్-2016 రాష్ట్రంలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 89.48 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం ఆరు గంటలకు ఈ పరీక్షకు సంబంధించిన సెట్ కోడ్‌ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 17 ప్రాంతీయ కేంద్రాల్లో 138 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

05/16/2016 - 18:03

గుంటూరు: అత్యాచారం కేసులో దాసరి గౌరీశంకర్, షకే సుబానీ అనే నిందితులకు 22 ఏళ్ల చొప్పున జైలుశిక్షను విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2014లో పేరేచర్ల నుంచి గుంటూరుకు వస్తున్న ఓ మానసిక వికలాంగురాలిపై ఈ ఇద్దరూ అత్యాచారం చేశారని కోర్టు విచారణలో రుజువైంది.

05/16/2016 - 18:01

కర్నూలు: కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులున్నాయా? అంటూ వైకాపా అధినేత జగన్ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలపై వాటా తేలకముందే ప్రాజెక్టులు కట్టడం తగదని ఆయన సోమవారం కర్నూలులో జలదీక్ష సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులతో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నా ఎపి సిఎం చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదన్నారు.

05/16/2016 - 16:20

విజయవాడ: ఎపి నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు, పేదవర్గాల పిల్లలకు పదేళ్లపాటు ఉచితవిద్యను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని విద్యాసంస్థల్లోనూ ఉచిత విద్యను అందిస్తారు.

05/16/2016 - 16:18

విజయవాడ: ఇటీవల జరిగిన జాతీయస్థాయి పాఠశాలల చదరంగం టోర్నీలో విజేతగా నిలిచిన పొట్లూరి సుప్రీతకు ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఇక్కడ అయిదు లక్షల రూపాయల నజరానా అందజేశారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటినందుకు ఆమెను అభినందించారు. త్వరలో జరిగే ఆసియా స్థాయి, ప్రపంచ స్థాయి పోటీల్లో ఆమె ఎపికి, దేశానికి వనె్న తేవాలని ఆయన ఆకాంక్షించారు.

05/16/2016 - 16:18

విజయవాడ: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను పోటీ పరీక్షలకు సర్వసన్నద్ధం చేసేందుకు చంద్రన్న విద్యా దీపం పథకాన్ని సోమవారం ఇక్కడ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ ప్రారంభించారు. 2019 నాటికి అన్ని పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలే అగ్రభాగాన నిలుస్తాయని నారాయణ అన్నారు.

05/16/2016 - 16:17

కర్నూలు: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వివాహితపై కొందరు ఆగంతకులు సోమవారం ఉదయం యాసిడ్ దాడి చేశాడు. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఈ దారుణం జరిగింది. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడికి పాల్పడ్డ ఆగంతకుల్లో రాజు అనే యువకుడు ఉన్నట్లు సమాచారం. యాసిడ్ దాడికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

05/16/2016 - 16:16

కర్నూలు: ఎపిలో సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, తెలంగాణలో అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఎపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ వైకాపా అధినేత జగన్ సోమవారం ఇక్కడ జలదీక్ష ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఆయన దీక్ష జరుపుతారు. దీక్ష సందర్భంగా వైకాపా స్థానిక నేతలు విస్తృత సన్నాహాలు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

05/16/2016 - 13:55

గుంటూరు: వైకాపా అధినేత జగన్ చేస్తున్న దీక్షల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని టిడిపి నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సోమవారం విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై అభ్యంతరాలుంటే ఆంధ్ర, తెలంగాణ పాలకులు చర్చలతో పరిష్కరించుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రాజెక్టులతో ఎపికి అన్యాయం జరుగుతోందంటూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం జగన్‌కు తగదన్నారు.

Pages