S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/17/2016 - 08:54

ఆళ్లగడ్డ, మే 16 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కోటకందుకూరు గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మపై శిరివెళ్లకు చెందిన రాజు సోమవారం యాసిడ్‌తో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ సంఘటనకు సంబంధించి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. కోటకందుకూరుకు చెందిన సుబ్బలక్ష్మమ్మను శిరివెళ్లకు చెందిన నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు మగ సంతానం.

05/17/2016 - 08:52

ఏలూరు, మే 16: అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్ రద్దుచేయాలని కోరుతూ బాధితుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈమేరకు ఒక వినతిపత్రాన్ని సంఘ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.

05/17/2016 - 08:50

హైదరాబాద్, మే 16: ఏడాదికాలం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీమ మంత్రాన్ని జపించడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. కృష్ణ, గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్నూలు జిల్లా వేదికగా జగన్ నిర్వహిస్తోన్న జలదీక్ష తొలిరోజు ధర్నాకు సానుకూల స్పందన లభించింది. ఇది ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించింది.

05/17/2016 - 08:47

విజయవాడ, మే 16: నీరు-ప్రగతి, నీరు-చెట్టు, జలసంరక్షణ కార్యక్రమాల ద్వారా రెండేళ్ల కాలంలో రూ.2,893 కోట్లు ఖర్చుచేసి 3లక్షల 60వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

05/17/2016 - 08:47

అనకాపల్లి, మే 16: ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగేదేముందో తెలపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. సోమవారం ఇక్కడి విలేఖర్లతో మాట్లాడారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ హరిబాబు అనకాపల్లిలోని స్థానిక ఎంపీ అవంతి శ్రీనివాసరావు కార్యాలయంలో తనను కలిసిన విలేఖర్లు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు.

05/17/2016 - 08:46

అనకాపల్లి, మే 16: నరేంద్రమోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాలకు సమకూరుస్తున్న నిధులను చంద్రబాబు ప్రభుత్వం అతి తెలివిగా తమ పథకాలకు మళ్లించుకుంటుందని బిజెపి సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు ఆరోపించారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన బిజెపి కార్యకర్తల విస్తృత సమావేశంలో మాట్లాడారు.

05/17/2016 - 08:46

గుంటూరు (లీగల్), మే 16: యుక్త వయసులో వున్నా ఆమెకేమీ తెలీదు.. మానసిక దివ్యాంగురాలు.. దీనికితోడు పుట్టు మూగ, చెవుడు. కళ్లు కూడా సరిగా కనపడక పోవడంతో గుంటూరులో వైద్యం చేస్తారని తెలుసుకున్న పేరేచర్ల ప్రాంతానికి చెందిన ఆ యువతి 2014 ఫిబ్రవరి 3న గుంటూరు చేరుకుంది. అమాయకంగా కనిపించిన ఆ యువతిని స్థానిక నల్లచెరువుకు చెందిన దాసరి గౌరీశంకర్, షేక్ సుభాని మూగభాషలోనే ఆమెను మాటల్లో పెట్టారు.

05/17/2016 - 08:45

విజయవాడ, మే 16: రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసి స్మార్ట్ వాటర్ గ్రిడ్ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని, అంతకుముందు పునరావాస కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

05/17/2016 - 08:44

విజయవాడ, మే 16: రాష్ట్ర విభజన తరువాత ఆస్తుల పంపకం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్యాయంగా వ్యవహరించినా, నదీ జలాల పంపకంలో ఆయన మొండిగా వ్యవహరిస్తున్నా మాట్లాడని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకునిగా జగన్ ఎప్పుడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించారా? అని ప్రశ్నించారు.

05/17/2016 - 08:43

కాకినాడ సిటీ, మే 16: తూర్పు గోదావరి జిల్లా రంగంపేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం బైక్ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక పిజి వైద్య విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా కేంద్రం అలకనంద వీధికి చెందిన వి సంజయ్(28), హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన ఎండి ఇమ్రాన్(28) ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో పిజి వైద్య విద్యార్ధులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Pages