S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/31/2016 - 04:52

హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధిని సాధించి ప్రాంతాల మధ్య అసమానతల తొలగింపే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తెలిపారు. 13 జిల్లాల్లో ఏడు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని, మిగిలిన వాటితో వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

03/31/2016 - 04:51

హైదరాబాద్, మార్చి 30: చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకనే తాము ద్రవ్య వినిమయ బిల్లుపై కోరిన డివిజన్‌ను వ్యతరేకించి మూజువాణి ఓటుతో ఆమోదించి అసెంబ్లీని వాయిదా వేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. డివిజన్‌కు అంగీకరిస్తే పార్టీ మారిన వైకాపా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే పరువుపోతుందనే భయంతో చంద్రబాబు ఉన్నారని ఆయన ఆరోపించారు.

03/31/2016 - 04:51

విజయవాడ, మార్చి 30: నేడు వైద్యంపై చేయాల్సిన వ్యయం సామాన్యులు భరించలేని స్థాయికి చేరుకుందంటూ రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్లినికల్ పరీక్షల పేరిట వైద్యులు ప్రజలపై మోపుతున్న భారాలే ఇందుకు కారణమన్నారు.

03/31/2016 - 02:45

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు నిరసనల మధ్య మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించగా వైకాపా సభ్యుడు కె. గోవర్దన్‌రెడ్డి, టిడిపి పక్షాన కాల్వ శ్రీనివాస్, బిజెపి సభ్యుడు విష్ణువర్దన్ తదితరులు మాట్లాడారు.

03/31/2016 - 02:40

హైదరాబాద్, మార్చి 30: అధికార, విపక్ష పార్టీల ఎత్తులు, పైఎత్తులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. అక్కడితో ఆగని వైకాపా స్పీకర్ కోడెల శివప్రసాదరావుపైనా అవిశ్వాసాన్ని ప్రకటించింది. దాంతో దానిపైనా శాసనసభలో సుదీర్ఘంగానే చర్చ జరిగింది.

03/31/2016 - 02:36

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. రెండు సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. శాసనసభ 15 రోజుల పాటు కొనసాగింది. 86 గంటల 25 నిమిషాల పాటు అజెండా చేపట్టామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. టిడిపి 60 గంటలు, వైకాపా 21 గంటలు, బిజెపి నాలుగున్నర గంటల సమయాన్ని వినియోగించుకున్నాయి. 124 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు.

03/31/2016 - 01:20

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను సాధించలేకపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన 2015 నివేదికలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆర్థిక ఖాతాలపై కాగ్ నివేదికలను ప్రభుత్వం బుధవారంనాడు శాసనసభలో ప్రవేశపెట్టింది.

03/30/2016 - 18:22

హైదరాబాద్: ఎపి బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదని అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి గానీ, ఆర్‌బిఐ నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేకుండానే పబ్లిక్ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమదే నైతిక విజయం అని ఆయన చెప్పారు.

03/30/2016 - 17:49

విజయవాడ: హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారికి చెందిన బ్యాంకు లాకర్‌ను ఎసిబి అధికారులు బుధవారం తెరిచి భారీగా నగలు కనుగొన్నారు. 19 లక్షల రూపాయల బంగారు నగలు, మూడు కిలోల వెండినగలు లాకర్‌లో లభించాయి.

03/30/2016 - 16:59

హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిన అనంతరం బుధవారం మధ్యాహ్నం ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

Pages