S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/03/2019 - 02:59

విజయవాడ (క్రైం), జనవరి 2: ఆంధ్రప్రదేశ్‌ను పూర్తి స్ధాయి అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్‌పీ ఠాకూర్ అన్నారు. అవినీతి నిర్మూలనలో రాష్ట్రం 19వ స్ధానం నుంచి మూడవ స్ధానానికి చేరుకుందన్నారు.

01/03/2019 - 02:58

అమరావతి, జనవరి 2: తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా ఫెడరల్ ఫ్రంట్.. బీజేపీ యేతర ఐక్య ఫ్రంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మహాకూటమి.. ఇలా పొత్తులపై వ్యూహాత్మక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.

01/03/2019 - 02:57

విజయవాడ, జనవరి 2: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తే, ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలు కలుగడమే కాకుండా, ప్రజల మన్ననలు పొందుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా తెలిపారు. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్ష బుధవారం ఆయన నిర్వహించారు.

01/03/2019 - 02:57

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలోని పింఛనుదారులు ఇకపై జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పీయూష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ కేంద్రాలు, మీ-సేవ కేంద్రాలు, పింఛను సర్వీస్ అసోసియేషన్స్, గుర్తింపు పొందిన వారి నుంచి డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్‌ను సమర్పించవచ్చు.

01/03/2019 - 02:43

రాజమహేంద్రవరం, జనవరి 2: ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రాలపై చర్చజరపాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శే్వతపత్రాలపై ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావాలంటే వాటిపై నిశితంగా చర్చ జరగాలన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు ఎవరొచ్చినా చర్చించడానికి తాను సిద్ధమని ప్రకటించారు.

01/02/2019 - 17:05

యడ్లపాడు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయపాడు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ముందు వెళుతున్న కంటెనైర్‌ను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

01/02/2019 - 17:03

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోరోజు కూడా పరిశీలించారు. కరీంనగర్‌లో బసచేసిన ఆయన రెండోరోజు రోడ్డు మార్గంగుండా కనె్నపల్లి చేరుకుని గ్రావిటి కాలువ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అలాగే అన్నారం బ్యారేజీ పనులను కూడా ఆయన పరిశీలించారు.

01/02/2019 - 17:03

కుప్పం: కేంద్రం నమ్మించి మోసం చేసిందని, అందుకే తాము కేంద్రంపై పోరాటం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కుప్పంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవటంతో తాను ఆక్రోశంలో ఉన్నానని మోదీ అనటంపై ఆయన మండిపడ్డారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎలాంటి సంస్థలను ఇవ్వలేదని అన్నారు.

01/02/2019 - 12:51

ఒంగోలు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆగివున్న లారీని కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పెరుమాళ్ల శివ, గ్రంధిశిల సుబ్బారావుగా గుర్తించారు. నర్సరావుపేట నుంచి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

01/02/2019 - 04:29

తిరుపతి, జనవరి 1: తిరుమలలో ఐదు రోజుల కిందట శుక్రవారం కిడ్నాప్‌కు గురైన మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన వీరేశ్ (18నెలలు)ను మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో బాలుడి తల్లిదండ్రులు ప్రశాంత్ జీ యాదవ్, స్నేహలకు ఎస్పీ అన్బురాజన్ అందించారు. దాదాపు 100 గంటల తరువాత బిడ్డ సురక్షితంగా చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Pages