S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/17/2018 - 06:58

విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 16: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు ఎన్నో కేసుల్లో స్టేలు తెచ్చుకొని తానేదో నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, ముడుపులు లేకుండా ఏ ప్రాజెక్టూ అమలు కావటం లేదని ఆరోపించారు. తాను మాట్లాడితే నిజాయతీ, అవతలి వాళ్లు మాట్లాడితే సత్యదూరమని విమర్శించటం విడ్డూరమన్నారు.

09/17/2018 - 06:57

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో కాపులు, బహుజనులు ఒకటైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఆ దిశగా ఆలోచనతో ఐక్యతకు కృషిచేయాలని పలువురు మేధావులు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి దళిత, బహుజన, మైనార్టీ, కాపు(డీబీఎంకే) రాజకీయ చైతన్య వేదిక సమావేశంలో ఈమేరకు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు.

09/17/2018 - 06:56

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: విశాఖ నగరం మరో అంతర్జాతీయ క్రీడకు వేదక కాబోతోంది. బీచ్ వాలీబాల్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది వాలీబాల్ (ఎఫ్‌ఐవీబీ) బీచ్ వాలీబాల్ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచంలోని 56 దేశాల్లో ఈ బీచ్ వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తోంది.

09/17/2018 - 06:55

అమరావతి, సెప్టెంబర్ 16: వరదల బీబత్సంతో ఆపదలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని పెద్దమనసుతో ఆదుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.

09/17/2018 - 06:05

తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఉదయం మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపైన, రాత్రి సర్వభూపాల వాహనంపైన సకల సద్గుణ సంపన్నుడైన శ్రీమన్నారాయణుడు భక్తులు దర్శనమిచ్చారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

09/17/2018 - 03:51

ఐరాల, సెప్టెంబర్ 16: చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పార్వతీ తనయుడైన గణనాథుడు మూషిక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి కాణిపాకం, తిరువణంపల్లి, అగరంపల్లి, పట్నం, వడ్డిపల్లి, కొత్తపల్లి, చిన్నకాంపల్లి, కంపల్లి గ్రామాల విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.

09/17/2018 - 03:47

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపటంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

09/17/2018 - 03:45

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 263వ రోజు ఆదివారం పెందుర్తి, భీమిని నియోజకవర్గాల్లో కొనసాగింది. జోరు న వర్షం కురుస్తున్నా జగన్‌తో పాదం కలిపేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం ధూపాలెం వద్ద ప్రారంభమైన యాత్ర ఎస్సార్‌పురం కాలనీ మీదుగా దబ్బంద వద్ద తిరిగి భీమిలి నియోజకవర్గంలో మరోసారి ప్రారంభమైంది.

09/17/2018 - 03:43

విజయవాడ, సెప్టెంబర్ 16: బీజేపీ మునిగిపోయే నావ అని, 2019 తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ఏమైపోతారో అర్థం కావడం లేదని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మట్లాడుతూ జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ అనడం విడ్డూరమన్నారు. అసెంబ్లీకి రాని జగన్ ముందస్తు ఎన్నికలొస్తాయని ఎలా చెప్పారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

09/17/2018 - 03:43

విజయవాడ, సెప్టెంబర్ 16: చంద్రబాబు నిరుద్యోగులకు చేసిన మోసంపై రాష్ట్ర వ్యాపితంగా పోరాటం చేస్తామని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్‌నాయుడు తెలిపారు. నగరంలోని ఒక హోటల్‌లో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారం చేపట్టే ముందు పాదయాత్ర చేసిన సందర్భంగా చంద్రబాబు ప్రధానంగా రెండు నినాదాలు చేశారన్నారు.

Pages