S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/14/2018 - 17:09

శ్రీశైలం: అన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చేవరకు జలదీక్ష ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిర్వహించిన జలసిరి కార్యక్రమానికి ఆయన హారతి ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చేవరకు ఈ జలదీక్ష ఆగదని అన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని అన్నారు.

09/14/2018 - 12:25

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది.

09/14/2018 - 12:12

తిరుమల: తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ శుక్రవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి ఆమె గైర్హుజరు అయ్యారు. ఇటీవల శ్రీవారి మహసంప్రోక్షణ కార్యక్రమంలో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు.

09/14/2018 - 12:10

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు పెద్ద శేషవాహనపై ఊరేగారు. ఉభయ దేవేరులతో కలిసి కలియుగ వైకుంఠ దైవం చిన శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.

09/13/2018 - 04:16

ఏలూరు, సెప్టెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అద్భుత ఘట్టానికి నాంది పడింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా భావించే స్పిల్‌వే గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించి, నడకకు శ్రీకారం చుట్టారు.

09/13/2018 - 04:13

కాకినాడ, సెప్టెంబర్ 12: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోన్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యావంతా వ్యక్తిగత ప్రచారానికే పరిమితమైంది తప్ప రాష్ట్భ్రావృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో బుధవారం సోము వీర్రాజు విలేఖరులతో మాట్లాడారు.

09/13/2018 - 04:12

గరుగుబిల్లి, సెప్టెంబర్ 12: కొద్దిరోజుల నుంచి విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలాన్ని హడలెత్తించిన ఏనుగుల గుంపుబుధవారం ఉదయం గరుగుబిల్లి మండలం గిజబ సమీపానికి చేరాయి. గ్రామానికి అతి సమీపంలోని పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారి పక్కనే ఉన్న అరటితోటలో తిష్టవేశాయి. దీంతో ఉదయం కొంత సమయం ఈ రహదారిపై ప్రయాణికులు, వాహనాలను అటవీశాఖ అధికారులు నిలిపివేశారు.

09/13/2018 - 04:08

అమరావతి, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో రెండో పరిశ్రమ ఏర్పాటుకు నిషా డిజైన్స్ సంస్థ ముందుకొచ్చింది. అనంతపురం జిల్లా గోరంట్లలో రూ. 65 కోట్లతో ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రభుత్వం తరపున ఈడీబీ సీఈఓ కృష్ణకిషోర్, నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ గోయంకా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

09/13/2018 - 04:04

విజయవాడ, సెప్టెంబర్ 12: తాను ఎప్పుడూ సచివాలయంలోనే ఉంటానని, అమరావతి బాండ్ల జారీపై వచ్చిన ఆరోపణలపై గురువారం కూడా తాను చర్చకు సిద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీ కుటుంబరావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సవాల్ విసిరారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బాండ్ల జారీలో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపించినా రాజీనామాకు తాను సిద్ధమన్నారు.

09/13/2018 - 04:02

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామని 2014 ఎన్నికలో మేనిఫేస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేస్తూ జీవోలు జారీచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ రాశారు.

Pages