S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/18/2018 - 14:02

కర్నూల్: కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కర్నూల్‌కు బయలుదేరారు. దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం బైరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

09/18/2018 - 12:47

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీలో ప్రభుత్వం పది బిల్లులను ప్రవేశపెట్టనున్నది.

09/18/2018 - 12:46

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మళయప్పస్వామి హనుమంత వాహనంపై ఊరేగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు.

09/18/2018 - 04:16

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 17: వన్ నేషన్...వన్ టాక్స్‌గా రూపొందించిన జీఎస్టీ అమలులో మాత్రం వన్ మోదీగానే సాగుతోందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, సవరణలపై పలు రాష్ట్రాలు సూచనలు చేస్తున్నప్పటికి వాటిని పట్టించుకోకుండా కేంద్రం తాను అనుకున్నదే చేస్తోందన్నారు.

09/18/2018 - 04:15

అమరావతి, సెప్టెంబర్ 17: శాసనసభలో విభజన హామీల అమలుపై లఘు చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలు లంటించారు. సభలో బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 98 శాతం విభజన హామీలు నెరవేర్చిందన్నారు.

09/18/2018 - 04:15

అమరావతి, సెప్టెంబర్ 17: కరవు జిల్లాల్లో అదనంగా మరో 50 రోజులు పనిదినాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. నీరు- ప్రగతి, వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లు, వివిధశాఖల అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరవు ప్రాంతాల్లో మొత్తంగా 150రోజుల పనిదినాలు కల్పించాలని రానున్న మూడు నెలల్లో మెటీరియల్ ఖర్చుపై శ్రద్ధ చూపాలన్నారు.

09/18/2018 - 04:14

విజయవాడ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవుల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి 21 వరకూ సూళ్లను మూసి వేయనున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి, 21 ఆదివారం కావడంతో 22న పాఠశాలలను పునఃప్రారంభం అవుతాయి. సెలవు రోజుల్లో పాఠశాలలను నడపవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

09/18/2018 - 04:11

అమరావతి, సెప్టెంబర్ 17: ఈ ఐదు నెలలు కీలకం..ప్రజలతో నిరంతరం మమేకం కావాలి.. కలసికట్టుగా పనిచేస్తేనే ఫలితాలు.. గ్రూపు విభేదాలకు స్వస్తిచెప్పండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు. సోమవారం రాత్రి ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో విజయనగరం జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయనగరం మంచి జిల్లా.. అక్కడి ప్రతిపక్షమే చెడు.. చెడు నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత టీడీపీ నేతలదే అన్నారు.

09/18/2018 - 03:35

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 17: అక్షర దోషాలను సైతం సాకుగా చూపిస్తూ రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు కేంద్రం కొర్రీలు వేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా చిన్న చిన్న విషయాలను, పదాల్లో అక్షరదోషాలను వంకగా చూపిస్తున్న కేంద్రం బిల్లును అమోదించడంలో కక్షసాధింపుగా వ్యవహరిస్తోందన్నారు.

09/18/2018 - 03:33

అమరావతి, సెప్టెంబర్ 17: రాష్ట్రంలోని జలాశయాల్లో కేజ్‌కల్చర్ ద్వారా తిలాపియా చేపల పెంపకాన్ని చేపట్టేందుకు అమెరికాకు చెందిన ‘ది ఫిష్ ఇన్’ సంస్థ ముందుకొచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రెండు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఏపీ మత్స్యశాఖ ఉన్నతాధికారులు, ది ఫిష్ ఇన్ సంస్థ ప్రతినిధులు ఒప్పంద, అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు.

Pages