S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/18/2018 - 03:28

విజయవాడ, సెప్టెంబర్ 17: వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ చాంఫియన్స్ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా వెళ్లిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ సోమవారం బిజీబిజీగా గడిపారు. బీజింగ్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాగా, కొన్ని కంపెనీలతో అంగీకార ఒప్పందాలను చేసుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన తన చైనా పర్యటనను వినియోగించుకుంటున్నారు.

09/18/2018 - 03:27

విజయవాడ, సెప్టెంబర్ 17: విజయనగరం, ప్రకాశం జిల్లాల్లోని వర్సిటీల క్యాంపస్‌లను పూర్తి స్థాయి యూనివర్సిటీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

09/18/2018 - 02:17

విజయవాడ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రహదారుల్లో అత్యధిక రహదారులకు తక్షణ మరమ్మతులు అవసరమే.. అలాగే పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా బైపాస్ రోడ్ల నిర్మాణమూ అవసరమే.. అయితే తమ శాఖకు నిధుల కొరత వెంటాడుతున్నదని ఇక ఫ్లైఓవర్‌లు కావాలని కోరుతుంటే ఎలాఅని శాసనసభ ప్రశ్నోత్తరాలతో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సమాధానమిచ్చారు.

09/18/2018 - 02:17

విజయవాడ, సెప్టెంబర్ 17: శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పోలవరం అంశంపై సోమవారం దాదాపు అరగంట సేపు రసవత్తర చర్చ జరిగింది. మంత్రి దేవినేని ఉమా ఓ సందర్భంగా ఇటీవల జరిగిన గ్యాలరీ వాక్‌ను ప్రస్తావిస్తూ ఈ వాక్‌ను జగన్ మీడియా పిక్నిక్‌గా ప్రచారం చేయటం శోచనీయమన్నారు.

09/18/2018 - 02:16

విజయవాడ, సెప్టెంబర్ 17: కోనసీమలో పాములు, విశాఖలో కుక్కల బెడదతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారని శాసనసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో తెలుగుదేశం సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, గొల్లపల్లి సూర్యారావు, రమేష్‌బాబు, బీజేపీ ఫ్లోర్‌లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

09/17/2018 - 15:43

తిరుమల:లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం ఆపద మొక్కులవాడు మోహినీ అవతారంలో సాక్షాత్కరించి భక్తులకు కనువిందు చేశాడు. దంతపు పల్లకిలో శ్రీ కృష్ణస్వామి తోడుగా మాఢ వీధుల్లో ఊరేగారు.

09/17/2018 - 15:40

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఊమెన్‌చాందీ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కర్నూలులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ వివరాలను చాందీ మీడియాకు వెల్లడించారు.

09/17/2018 - 15:27

అనంతపురం: అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లా తెదేపా నేతలు కూడా పాల్గొన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

09/17/2018 - 07:00

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని చైనాలోని తెలుగువారికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా ఆయన చైనా తెలుగు అసోసియేషన్ సభ్యులతో ఆదివారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు కలిసే ఉన్నారన్నారు. తెలుగువారు ఎక్కుడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.

09/17/2018 - 06:59

గుంటూరు, సెప్టెంబర్ 16: ఆపరేషన్ గరుడలో ఐవైఆర్ కృష్ణారావు కీలక పాత్రధారి అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కోకన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆరోపించారు. ఆదివారం గుంటూరులోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని విమర్శించారు.

Pages